News January 12, 2026

PGRS ఫిర్యాదులు పునరావృతం కాకూడదు: SP

image

ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, వేగంగా పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ప్రజల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా సంబంధిత స్టేషన్‌ల అధికారులు పరిష్కరించాలని చెప్పారు.

Similar News

News February 14, 2026

GNT: కన్నీళ్లు తెప్పిస్తున్న.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు

image

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొన్ని సెంటర్లు ప్రజలకు కంటతడి పెట్టిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో రక్షణ లేకుండా ఫుడ్ తయారీ చేస్తున్నారు. ఫుడ్‌లో వినియోగించే స్పైసెస్ గాలికి రోడ్డుపై ప్రయాణించే వారి కళ్లల్లో పడి ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో చేసేది లేక కళ్లు తుడుచుకొని వెళ్తున్నారు. నిర్వాహకులు, అధికారులు జాగ్రత్తలు పాటిస్తే మేలని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.

News February 13, 2026

వినియోగదారుల హక్కులు పరిరక్షించాలి: JC

image

వినియోగదారుల హక్కులు పరిరక్షణ జరగాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జేసీ మాట్లాడుతూ.. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం వినియోగదారుల హక్కుల పరిరక్షణకు జిల్లా వినియోగదారుల రక్షణ మండలి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిటీ సభ్యులు సూచించిన అంశాల పట్ల సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News February 13, 2026

GNT: టెన్త్, ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

గుంటూరు జిల్లాలో పది, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. పది, ఇంటర్ పరీక్షలపై కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయుటకు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య శిబిరాలు, అందులో అత్యవసర మందులు ఉండాలని చెప్పారు.