News August 8, 2025

సుంకాల నుంచి ఫార్మాకు మినహాయింపు.. ఎందుకంటే?

image

అమెరికాలో వాడే జనరిక్ మెడిసిన్లలో 40% మందులు భారత్ నుంచి ఎగుమతి అవుతాయి. క్యాన్సర్, ఇతర ప్రమాదక వ్యాధులకు మన దేశ మందులనే వాడుతారు. అయితే ట్రంప్ సర్కార్ టారిఫ్స్ నుంచి ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చింది. మెడిసిన్ ధరలు భారీగా పెరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని భారత ఫార్మా కంపెనీలు USలోనే ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

Similar News

News August 8, 2025

రూ.25 లక్షల లంచం తీసుకుంటూ దొరికాడు

image

AP: 3 వారాల్లో రిటైర్మెంట్. కొడితే జాక్ పాట్ కొట్టాలని, ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకున్నాడేమో. ఓ సంస్థకు రూ.35 కోట్ల బిల్లుల మంజూరు కోసం గిరిజన సంక్షేమ శాఖ ENC సబ్బవరపు శ్రీనివాస్‌ రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేశాడు. ఆ సంస్థ ఫిర్యాదుతో ట్రాప్ చేసిన ACB రూ.25లక్షల టోకెన్ అమౌంట్ తీసుకుంటుండగా విజయవాడలో పట్టుకుంది. గతంలోనూ 2 సార్లు పట్టుబడినా ఆయనలో మార్పురాలేదు. ACB చరిత్రలో అతిపెద్ద ట్రాప్‌గా తెలుస్తోంది.

News August 8, 2025

AP న్యూస్ రౌండప్

image

* విశాఖ గ్యాస్ సిలిండర్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం
* నెల్లూరు జిల్లా చెర్లోపల్లి గేటు సమీపంలో గంగా-కావేరీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
* తిరుపతిలో ముంతాజ్ హోటల్‌కు భూకేటాయింపులు రద్దు
* జిల్లా కేంద్రాల్లో టెక్నాలజీ సర్వీసెస్ కేంద్రాలు: మన్నవ మోహన్ కృష్ణ
* నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) ప్రారంభం

News August 8, 2025

భారత్ నుంచి ఆర్డర్లు నిలిపివేసిన అమెజాన్?

image

ట్రంప్ టారిఫ్స్ దెబ్బతో భారత్ నుంచి స్టాక్ పంపించొద్దని తమ ఎగుమతిదారులకు యూఎస్ నుంచి మెయిల్స్, లెటర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అమెజాన్, వాల్‌మార్ట్, టార్గెట్, గ్యాప్ వంటి సంస్థలు ఆర్డర్లు నిలిపేయాలని సూచించినట్లు సమాచారం. తదుపరి అప్డేట్ అందేవరకూ ఎగుమతులను నిలిపేయాలని కోరినట్లు తెలుస్తోంది. కాగా ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.