News June 15, 2024

జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ?

image

TG: ఆగస్టు 15లోగా ₹2లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోంది. జులై 15 నుంచి ₹50వేల లోపు, ఆ తర్వాత ₹75వేలు, ₹లక్ష.. ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది. రైతుల్లో 70% మందికి ₹లక్ష లోపు రుణం ఉన్నట్లు అంచనా. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలినవారికి AUG 15లోగా జమ చేయాలనే అంశంపైనా చర్చ సాగుతోంది. నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందట.

Similar News

News January 21, 2026

VZM: రబీ లక్ష్యం దాటిన ఉద్యాన మిషన్

image

జిల్లాలో రబీ సీజన్‌లో ఉద్యాన సాగు లక్ష్యాన్ని మించి పెరిగిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. లక్ష్యంగా పెట్టుకున్న 4,000 ఎకరాలకు బదులుగా 4,800 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని చెప్పారు. ఖరీఫ్‌లో మరో 6,000 ఎకరాల్లో ఉద్యాన సాగుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

News January 21, 2026

T20WC ఆడతామో.. లేదో: బంగ్లా కెప్టెన్

image

టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. బోర్డు తీరుతో మీరు ఏకీభవిస్తున్నారా? అని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ అంశంపై నేను మాట్లాడటానికి ఏమీ లేదు. వరల్డ్ కప్ ఇంకా చాలా దూరంలో ఉంది. జట్టు పాల్గొంటుందో లేదో నేను కచ్చితంగా చెప్పలేను. ఇండియాకు వెళ్లడానికి నిరాకరించే ముందు బోర్డు మాతో ఏమీ డిస్కస్ చేయలేదు’ అని చెప్పారు.

News January 21, 2026

రాష్ట్రంలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌లు

image

తెలంగాణలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘నగర్ వన్ యోజన’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.8.26 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్ గూడ-II, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, మేడ్చల్ జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్కుల ఏర్పాటు జరుగుతుంది.