News October 5, 2025
రిలే దీక్ష కొనసాగిస్తామన్న పీహెచ్‌సీ వైద్యులు!

AP: <<17917251>>పీహెచ్‌సీ<<>> వైద్యులతో ప్రభుత్వం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తమ డిమాండ్లకు పూర్తిగా అంగీకారం తెలపకపోవడంతో వైద్యులు రిలే దీక్షలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం పీజీ ఇన్ సర్వీస్ 20% కోటాను ఏడాది కొనసాగించేందుకు అంగీకరించినట్లు ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. అయిదేళ్లు కొనసాగించడం కష్టమేనని పేర్కొన్నారు. దీంతో దీక్షలు కొనసాగిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News October 5, 2025
శబరి బ్లాకులో లాయర్లతో TPCC నేతల భేటీ

కాసేపటి క్రితం ఢిల్లీకి చేరిన TPCC ముఖ్య నేతలు తెలంగాణ భవన్ శబరి బ్లాకులో తమ లాయర్లతో భేటీ అయ్యారు. BCలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వాదనలు, GO నిలబడేందుకు గల అవకాశాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, BC సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, TPCC చీఫ్ మహేశ్ చర్చిస్తున్నారు.
News October 5, 2025
త్వరలో కురుపాం గురుకులం వెళ్తా: పవన్

AP: అనారోగ్యంతో కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందన్నారు. త్వరలో కురుపాం వెళ్లి గురుకులంలో పరిస్థితిని పరిశీలిస్తానని పేర్కొన్నారు.
News October 5, 2025
పోలింగ్‌లో 17 మార్పులు.. బిహార్‌లో స్టార్ట్ (1/3)

1. ఓటరుగా రిజిస్టరైన 15 రోజుల్లో ఓటర్ కార్డు డెలివరీ
2. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు
3. ప్రతి బూత్‌లో ఓటర్ల సంఖ్య 1500 నుంచి 1200కు తగ్గింపు
4. EVMలపై అభ్యర్థి కలర్ ఫొటో, పెద్ద సైజులో అక్షరాలు
5. బూత్ అధికారి అధికారిక ID కార్డుతో ఉంటారు
6. ప్రతి బూత్‌లో 100% వెబ్ కాస్టింగ్
7. బూత్ లెవల్ ఏజెంట్లు అందరికీ ట్రైనింగ్
8. బూత్ ఓట్ల లెక్కింపులో తేడాలుంటే అక్కడి VVPATలు కూడా లెక్కిస్తారు