News September 6, 2024

ఇంగ్లండ్ టీ20 జట్టు కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్

image

AUSతో జరగనున్న 3 T20ల సిరీస్‌కు ENG కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్ నియమితులయ్యారు. జోస్ బట్లర్ గాయం వల్ల దూరమవడంతో సాల్ట్‌కు అవకాశం దక్కింది. ఇతను 31 T20ల్లో 165.11 స్ట్రైక్ రేటుతో 885 రన్స్ చేశారు. ఈ నెల 11, 13, 15 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
టీమ్: ఫిల్ సాల్ట్(C), ఆర్చర్, జాకబ్, బ్రైడన్, జోర్డాన్, సామ్ కరన్, హల్, జాక్స్, లివింగ్‌స్టోన్, సాకిబ్, మౌస్లీ, ఓవర్‌టన్, రషీద్, టోప్లీ, జాన్ టర్నర్

Similar News

News February 4, 2025

బసవతారకం ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ టెస్టులు

image

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా HYD బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల28 వరకు ఫ్రీ క్యాంప్ కొనసాగుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఉ.10 నుంచి మ.ఒంటి గంట వరకు ఉచితంగా ప్రైమరీ టెస్టులు, ఆ తర్వాత అవసరమైన పరీక్షలను తక్కువ ధరకు చేయనున్నట్లు పేర్కొన్నాయి.

News February 4, 2025

పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE

image

TGలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముందుగా MPTC, ZPTCలకు ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. MPTC స్థానాల పునర్విభజన కోసం అధికారులు ఇప్పటికే జిల్లాల నుంచి నివేదికలు తెప్పించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు ఈ నెల 15లోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

News February 4, 2025

PGECET, ICET షెడ్యూల్ ఇదే

image

TG: ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే PGECET నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానుంది. అదే నెల 17-19 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు ఉండనున్నాయి.

☛ MBA, MCA తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET నోటిఫికేషన్ మార్చి 6న రిలీజ్ కానుంది. అదే నెల 10 నుంచి మే 3 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. జూన్ 8, 9న పరీక్ష ఉంటుంది.