News August 6, 2024

ఫొగట్‌.. ది రియల్ ఫైటర్: ఫ్యాన్స్

image

పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె రియల్ ఫైటర్ అని కొనియాడుతున్నారు. లైంగిక వేదింపుల ఆరోపణలో బ్రిజ్ భూషన్‌ను ఆరెస్ట్ చేయాలని ఢిల్లీ వీధుల్లో ఆమె కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలను ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. ఎన్నో అవమానాలు, అరెస్టులను ఎదుర్కొన్నారని, ఒలింపిక్స్‌లో గోల్డెన్ గర్ల్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

Similar News

News January 23, 2026

శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.

News January 23, 2026

నేడు వసంత పంచమి.. ఈ పనులు చేయకండి

image

వసంత పంచమిని జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే రోజుగా చెప్తారు. ఇవాళ పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘దీనిని ప్రకృతి పండుగగా భావిస్తారు. నేడు వసంత రుతువు ప్రారంభమవుతుంది. అందుకే చెట్లు, మొక్కలకు హాని చేయకూడదు. నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇవాళ శుక్రుడు అస్తమిస్తున్నాడు. అందుకే శుభకార్యాలు, వ్యాపారాలు ప్రారంభించొద్దు’ అని సూచిస్తున్నారు.

News January 23, 2026

నేడు ఏ రంగు దుస్తులు ధరించాలంటే..?

image

వసంత పంచమి నాడు పసుపు రంగుకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇది జ్ఞానానికి, కొత్త చిగురులకు, సూర్యకాంతికి చిహ్నం. ఈరోజున భక్తులు పసుపు రంగు దుస్తులు ధరించి పూజలో పాల్గొంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. పూజలో పసుపు రంగు పువ్వులు, పసుపు అక్షింతలు వాడటంతో పాటు, నైవేద్యంగా పసుపు రంగు వంటకాలు సమర్పిస్తే సానుకూల శక్తి పెరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే సరస్వతీ దేవి అనుగ్రహంతో విద్యాబుద్ధులు సొంతమవుతాయని నమ్మకం.