News August 14, 2024

ఈనెల 17న ఢిల్లీకి ఫొగట్: పునియా

image

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్ వరకూ చేరి బరువు ఎక్కువగా ఉండటంతో డిస్‌క్వాలిఫై అయిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఈనెల 17న స్వదేశానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ఆమె ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి చేరుకుంటారని రెజ్లర్ భజరంగ్ పునియా వెల్లడించారు. రియల్ ఫైటర్‌కు ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. కాగా ఈనెల 16న ఆర్బిట్రేషన్ కోర్టు(CAS) తీర్పు వెలువరించనుంది.

Similar News

News February 8, 2025

0..0..0: ఢిల్లీలో కాంగ్రెస్ హ్యాట్రిక్ డకౌట్

image

దేశ రాజధాని ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీసం 40% ఓటుషేర్ సంపాదించేది. మాజీ CM షీలాదీక్షిత్ నాయకత్వంలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న పార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుసగా మూడో సారీ ఖాతా తెరవకుండా హ్యాట్రిక్ డకౌట్ రికార్డు ఖాతాలో వేసుకుంది. క్రితంసారి 3% ఓటుషేర్ సాధించిన హస్తం పార్టీ ఈసారి 7 శాతంతో ఆనందపడాల్సి వస్తోంది. ఆ పార్టీ దుస్థితిపై మీ కామెంట్.

News February 8, 2025

బీజేపీ ఘన విజయం

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 36 స్థానాల మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మరో 11 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. అటు ఆప్ 19 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది.

News February 8, 2025

ఢిల్లీ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనకు ఓటేశారు: మోదీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం పొందడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘జనశక్తి ప్రధానం. అభివృద్ధి, సుపరిపాలనను గెలిపించారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు సెల్యూట్. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, వికసిత్ భారత్‌ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించే విధంగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!