News August 7, 2024
ఫొగట్ నువ్వు మా దృష్టిలో ఛాంపియనే: PV సింధు

పారిస్ ఒలింపిక్స్‌లో పతాక బరిలో నిలిచిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై <<13796504>>అనర్హత<<>> వేటు పడటంపై బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు స్పందించారు. ‘ఫొగట్ నువ్వు మా దృష్టిలో ఛాంపియనే. స్వర్ణం గెలుస్తావని ఆశించాను. బెంగళూరులోని PDCSEలో నేను నీతో గడిపిన కొద్ది సమయంలో నీ పోరాట స్ఫూర్తిని గమనించాను. ఇది ఎందరికో స్ఫూర్తిదాయకం. నీకు సపోర్ట్‌గా నేనున్నా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 22, 2026
వైద్యవిద్యా పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: సత్యకుమార్

AP: వైద్యవిద్యా పరీక్షలు మరింత పకడ్బందీగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. NTR హెల్త్ వర్సిటీలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ‘37 GOVT, PVT వైద్య కళాశాలల CC కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానించాం. విద్యార్థుల ప్రతి కదలిక కంప్యూటర్లలో నిక్షిప్తం అవుతుంది. వర్సిటీ నిర్వహించే అన్ని పరీక్షలను దశల వారీగా వీటితో పరిశీలిస్తాం’ అని చెప్పారు.
News January 22, 2026
పిల్లలకు SM వాడకంపై బ్యాన్ విధించే యోచనలో ఏపీ ప్రభుత్వం?

ఆంధ్రప్రదేశ్‌లో 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. AUS ప్రభుత్వం అమలు చేసిన SM బ్యాన్ నమూనాను ఏపీలో కూడా అధ్యయనం చేస్తున్నట్లు దావోస్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. చిన్నారుల మానసిక ఆరోగ్యం, ఆన్‌లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని వారు SMను వాడకుండా ఉండేలా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు చెప్పారు.
News January 22, 2026
విజయనగరం జిల్లా ఎస్. కోటలో మెగా జాబ్‌మేళా

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, విజయనగరం జిల్లా ఎస్ కోట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జనవరి 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ అర్హత గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.inలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. 10 మల్టీ నేషనల్ కంపెనీలు 535 పోస్టులను భర్తీ చేయనున్నాయి.


