News November 11, 2024
ఫోన్ స్విచాఫ్.. పరారీలో నటి కస్తూరి?
తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో ఓ బహిరంగ కార్యక్రమంలో కస్తూరి మాట్లాడుతూ తెలుగు ప్రజలు ప్రాచీన కాలంలో తమిళరాజులకు సేవ చేసిన మహిళలకు వారసులు అని వ్యాఖ్యానించారు. ఇది తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. పలు కేసులు నమోదవడంతో పాటు ఆమెకు లీగల్ నోటీసులు అందాయి. కాగా ఆమె ఇంటికి తాళం వేసి పరారైనట్లు తెలుస్తోంది. ఫోన్ కూడా స్విచాఫ్ అయ్యింది.
Similar News
News November 13, 2024
‘పుష్ప2’: శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతంటే?
టాలీవుడ్ తెరకెక్కిస్తోన్న మరో ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అందులో యంగ్ బ్యూటీ శ్రీలీల చిందులతో సందడి చేయనున్నారు. అందుకోసం రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ‘పుష్ప1’లో సమంత రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అటు ఈ మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
News November 13, 2024
మండలి నుంచి YCP ఎమ్మెల్సీల వాకౌట్
AP: శాసనమండలి నుంచి వైసీపీ MLCలు వాకౌట్ చేశారు. విజయనగరంలో డయేరియా వ్యాప్తి విషయంలో మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేసినట్లు సభ్యులు ప్రకటించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘సత్యకుమార్ వ్యాఖ్యలు బాధాకరం. సభలో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. ఆయనకు పైశాచిక ఆనందం ఉన్నా సరే, సభలో హుందాగా మెలగాల్సింది’ అంటూ బొత్స ఫైరయ్యారు.
News November 13, 2024
లగచర్ల ఘటన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
TG: వికారాబాద్ లగచర్ల ఘటనకు సంబంధించి పోలీస్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తం 46 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. A-1గా భోగమోని సురేశ్ పేరు చేర్చారు. అధికారులపై హత్యాయత్నం జరిగిందని, విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని పేర్కొన్నారు. ముందుగానే కారం, రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకున్నారని తెలిపారు.