News April 12, 2024
లోకేశ్‌కు ‘ఫోన్ ట్యాపింగ్’ అలర్ట్
AP: టీడీపీ నేత నారా లోకేశ్‌కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్ పంపింది. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ప్రయత్నం జరుగుతోందని ఈమెయిల్‌లో తెలిపింది. అందుకు సంబంధించి ఆయనకు జాగ్రత్తలు సూచించింది. దీంతో లోకేశ్ ఫోన్‌ను వైసీపీ ప్రభుత్వమే ట్యాప్ చేస్తోందని టీడీపీ ఆరోపించింది. ఈమేరకు ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్డీఏ నేతలను లక్ష్యంగా చేసుకుని, కొందరు పోలీసులు అనధికారంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని పేర్కొంది.
Similar News
News November 16, 2024
నేడు, రేపు ‘మహా’లో CM రేవంత్ ప్రచారం
TG: సీఎం రేవంత్ నేడు, రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఉ.10గంటలకు HYD నుంచి బయలుదేరుతారు. చంద్రాపుర్‌లో మొదలుపెట్టి రాజురా, డిగ్రాస్, వార్ధా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారు. రేపు నయాగావ్, భోకర్, సోలాపుర్‌ల్లో ప్రచార సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు.
News November 16, 2024
పాకిస్థాన్‌కు మరో దెబ్బ.. BCCI బాటలోనే కబడ్డీ టీమ్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. PAKలో జరిగే ఫ్రెండ్లీ గేమ్స్ కోసం భారత కబడ్డీ జట్టును పంపేది లేదని తేల్చింది. దీంతో పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. కాగా భారత ప్రభుత్వ నిర్ణయంతో పాకిస్థాన్ ఆదాయానికి గండి పడినట్లయింది. సెక్యూరిటీ కారణాల వల్లే ఆటగాళ్లను పంపించట్లేదని కేంద్రం అంటోంది.
News November 16, 2024
IIT మద్రాసుతో 8 ఒప్పందాలు: మంత్రి లోకేశ్
AP: రాష్ట్ర ప్రభుత్వం IIT మద్రాసుతో 8 రకాల ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. CRDA, మ్యారీ టైం బోర్డు, స్కిల్ డెవలప్‌మెంట్, విద్య, ఇన్వెస్టిమెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, IT, RTGS శాఖలతో IIT మద్రాస్ ఒప్పందాలు కుదిరాయని ఆయన అన్నారు. ఐఐటి మద్రాసు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించిన అనంతరం కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.