News June 27, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన నిందితులకు నాంపల్లి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. పోలీసు అధికారులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టేశారు. గతంలోనూ వారికి బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే.
Similar News
News January 16, 2026
సాయంత్రం 6గంటలకు బిగ్ రివీల్: లోకేశ్

AP: గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రం గ్లోబల్ హబ్‌గా మారనుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్ వరకూ సప్లై చేస్తామని ఆయన వెల్లడించారు. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడుల వల్ల 8 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. ఈ సాయంత్రం 6గంటలకు బిగ్ రివీల్ కోసం వేచి ఉండండి అని తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి భారీ పెట్టుబడుల ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది.
News January 16, 2026
పూరీ-సేతుపతి ‘స్లమ్ డాగ్’.. ఫస్ట్ లుక్ విడుదల

పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాకు ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్ ఖరారైంది. హీరో బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ నోట్ల కట్టల మధ్య కత్తి పట్టుకొని కనిపిస్తున్నారు. సంయుక్తా మేనన్, టబు, దునియా విజయ్ నటిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News January 16, 2026
వెండి ‘విశ్వరూపం’: 16 రోజుల్లోనే రూ.50వేలు పెరిగింది!

2026 ప్రారంభంలోనే వెండి ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో జనవరి 1న కేజీ వెండి రూ.2.56 లక్షలు ఉండగా కేవలం 16 రోజుల్లోనే రూ.50వేలు పెరిగి ఇవాళ రూ. 3.06 లక్షలకు చేరింది. పారిశ్రామికంగా పెరిగిన డిమాండ్, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, సరఫరా లోటు వల్ల వెండి ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా ఇన్వెస్టర్లకు వెండి భారీ లాభాలనిస్తోంది.


