News July 11, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పుని న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. తమను అరెస్ట్ చేసి 100 రోజులు దాటిందని నిందితులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు పిటిషన్లో పేర్కొన్నారు. ఛార్జ్‌షీటు సైతం సక్రమంగా దాఖలు చేయలేదని తెలిపారు.
Similar News
News October 15, 2025
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైన ‘కన్నప్ప’

మంచు విష్ణు, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘కన్నప్ప’ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ కుమార్ నటించిన విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీని జెమినీలో అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు ప్రీమియర్‌గా ప్రదర్శించబోతోన్నారు.
News October 15, 2025
ఇండో-అమెరికన్ ఆష్లీ టెల్లిస్ అరెస్ట్

ఇండో అమెరికన్ ఆష్లీ టెల్లిస్(64)ను వర్జీనియాలో అరెస్టు చేశారు. ఆయన US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్‌లో సీనియర్ అడ్వైజర్‌గా ఉన్నారు. ఆయన జాతీయ రక్షణకు సంబంధించి టాప్ సీక్రెట్స్ దొంగిలించారని, చైనా అధికారులను కలిశారని ఆరోపణలు ఉన్నట్లు US మీడియా పేర్కొంది. ఈయన ముంబైలో జన్మించారు. ఆష్లీ టెల్లిస్ విదేశాంగ విధాన నిపుణుడు, వ్యూహకర్త. అంతర్జాతీయ భద్రత, రక్షణ, ఆసియా వ్యూహాత్మక అంశాలపై విశేష ప్రావీణ్యం ఉంది.
News October 15, 2025
ప్రతి విద్యార్థి స్కూల్లో ఉండాలి: భట్టి విక్రమార్క

TG: విద్యారంగం ప్రతిష్టాత్మకమైందని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ప్రగతిపై సమీక్షించారు. ‘పథకంలో సమస్యలుంటే యాజమాన్యాలు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలి. విద్యార్థులను పంపేయడానికి వీల్లేదు. ఈ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలి’ అని భట్టి ఆదేశించారు.