News June 26, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు: రేపు తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీటు లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. అరెస్టైన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వొచ్చని అన్నారు. జూన్ 10నే ఛార్జిషీట్ దాఖలు చేసినా కొన్ని కారణాలతో వెనక్కి పంపినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది.
Similar News
News October 25, 2025
కీళ్ల నొప్పులు మహిళలకే ఎందుకు ఎక్కువ?

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కీళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి జన్యుపరంగానే కాకుండా జీవనశైలి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘రుతుస్రావం, గర్భం, మెనోపాజ్ సమయాల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలలో మార్పులు ఆర్థరైటిస్ లక్షణాలను ప్రభావితం చేస్తాయి. అలాగే బరువు పెరగడం, ఇంటి పనులు, శారీరక, మానసిక సమస్యలు కూడా కీళ్లపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి’ అని పేర్కొంటున్నారు.
News October 25, 2025
ఆర్థరైటిస్ ఎలా నివారించాలి?

మహిళల్లో కీళ్ల నొప్పులను(ఆర్థరైటిస్) నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తూ బరువు, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. నడక, ఈత, సైక్లింగ్ వంటివి కండరాలను బలోపేతం చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉండే చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాలు తీసుకోవాలి. అవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు అధికంగా తీసుకోవాలి.
News October 25, 2025
పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి ₹1,25,620కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,150 ఎగిసి ₹1,15,150గా ఉంది. అటు KG వెండి ధర రూ.1,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


