News November 29, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు.. US సర్కార్‌కు ప్రభాకర్ రావు పిటిషన్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని US ప్రభుత్వాన్ని కోరారు. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, TG ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్లోరిడాలో కుమారుడి వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఆయనను స్వదేశానికి రప్పించేందుకు, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు TG పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Similar News
News November 29, 2024
కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది: కాంగ్రెస్
పార్లమెంటు సమావేశాలు వరుసగా వాయిదా పడుతున్నా కేంద్రం ఎందుకు సభను నియంత్రించడం లేదన్నది మిస్టరీగా ఉందని కాంగ్రెస్ పేర్కొంది. అదానీ వ్యవహారం, మణిపుర్, సంభల్ అల్లర్లు, ఢిల్లీలో శాంతిభద్రతల అంశాలపై సభలో విపక్షాల ఆందోళనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జైరాం రమేశ్ అన్నారు. ఈ అంశాల్లో విమర్శలకు బాధ్యత వహించాలన్న భావనతో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందని విమర్శించారు.
News November 29, 2024
పెర్త్‌లో విరాట్ అందుకే సక్సెస్ అయ్యారు: పాంటింగ్
పెర్త్ టెస్టులో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించారు. కోహ్లీని చూసి ఆస్ట్రేలియా బ్యాటర్లు నేర్చుకోవాలని సూచించారు. ‘విరాట్ ప్రత్యర్థులతో పోరాడాలని భావించలేదు. తన బలాలపైనే దృష్టిసారించారు. విజయం సాధించారు. లబుషేన్, స్మిత్ కూడా అదే అనుసరించాలి. క్రీజులో పాతుకుపోవాలని కాకుండా పరుగులు సాధించేందుకు, సానుకూలంగా ఆడేందుకు చూడాలి’ అని పేర్కొన్నారు.
News November 29, 2024
మహారాష్ట్రలో కీలక సమావేశం రద్దు
మహారాష్ట్ర CM ఎవరో తేల్చే కీలక సమావేశం రద్దైంది. నిన్న ఢిల్లీ వెళ్లిన ‘మహాయుతి’ నేతలు BJP అధిష్ఠానాన్ని కలిసినా స్పష్టత రాలేదు. ఇవాళ ముంబైలో సమావేశం నిర్వహించి CM ఎవరో ఫైనల్ చేస్తామని శిండే ప్రకటించారు. కాగా, ఆయన ఢిల్లీ నుంచి ముంబైకి రాగానే స్వగ్రామం సతారా జిల్లాలోని దారే బయల్దేరారు. దీంతో శివసేన పార్టీ సమావేశం కూడా వాయిదా పడింది. ఆయన ముంబై తిరిగొచ్చిన తర్వాతే ఆదివారం సమావేశాలు ఉంటాయని సమాచారం.