News March 29, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధా కిషన్రావుకు రిమాండ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధా కిషన్రావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. ఇప్పటికే మాజీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అరెస్టు అయిన విషయం తెలిసిందే.
Similar News
News January 4, 2026
వరి మాగాణి మినుములో ఎండు తెగులు నివారణ

ఎండు తెగులు ఆశించిన మినుము మొక్కలు వడలి, ఎండి పంటకు నష్టం వాటిల్లుతుంది. భూమిలోని శిలీంధ్రం ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు పంట మార్పిడితో పాటు పొలంలో నీరు నిల్వలేకుండా చూడాలి. పైరు విత్తే ముందు kg విత్తనానికి 3గ్రా. కార్బెండజిమ్ పట్టించి విత్తాలి. ఎకరాకు 80kgల చివికిన పశువుల ఎరువు+20kgల వేపపిండిలో 2kgల ట్రైకోడెర్మావిరిడె జీవశిలీంధ్రాన్ని కలిపి విత్తే సమయంలో భూమిలో కలియదున్నుకోవాలి.
News January 4, 2026
గర్భసంచి చిన్నగా ఉందా..?

ఆడవారి శరీరంలో గర్భాశయం చాలా ముఖ్యమైన అవయవం. గర్భాశయం ఆకారంలో, సైజులో మార్పులు కొందరికి చిన్నవయస్సు నుంచే ఉంటే, మరికొందరికి ఎదుగుతున్న క్రమంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. గర్భాశయం చిన్నదిగా ఉండటం వల్ల కొన్నిసార్లు పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ప్రతి అవయవంలోనూ మనిషి మనిషికీ తేడా ఉన్నట్లే గర్భసంచి పరిమాణం విషయంలో కూడా సుమారుగా 1-2 సెంటీమీటర్ల వరకు తేడా ఉండొచ్చు.
News January 4, 2026
గర్భసంచి చిన్నగా ఉంటే ఏమవుతుందంటే?

గర్భసంచి ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ కేజీ వరకు పెరుగుతుంది. గర్భసంచి సైజు కొన్నిసార్లు జన్యు ఆధారితంగా కాగా, కొన్నిసార్లు హార్మోన్ల లోపాల వల్ల చిన్నదిగా ఉండొచ్చు. దీనివల్ల అబార్షన్లు అవడం, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవడం, ప్రీ టెర్మ్ డెలివరీ అయిపోవడం, బరువు తక్కువగా ఉన్న పిల్లలు పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి సందర్భాల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లను వైద్యులు సూచిస్తారు.


