News April 3, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌కు 7 రోజుల కస్టడీ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌ను నాంపల్లి కోర్టు ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న అతడిని దర్యాప్తు బృందం రేపు ఉదయం కస్టడీలోకి తీసుకోనుంది. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పీఎస్‌లో అతడిని విచారించనుంది.

Similar News

News March 17, 2026

దీదీని ఓడించేందుకు BJP మాస్టర్ ప్లాన్!

image

<<19408277>>మమతా బెనర్జీ<<>>ని ఆమె కోటలోనే కట్టడి చేసేందుకు BJP మాస్టర్ ప్లాన్ వేసింది. బలమైన నేత సువేందును పోటీకి దింపి దీదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయకుండా అడ్డుకట్ట వేయనుంది. 2021లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన ఆయన ఇప్పుడు భవానీపూర్‌లోనూ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గుజరాతీ, మార్వాడీ వంటి నాన్-బెంగాలీ ఓటర్లు 40% ఉండటంతో ఇక్కడ పోటీ టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీదీని డిఫెన్స్‌లో పడేయాలన్నది BJP అసలు స్కెచ్.

News March 17, 2026

హోటల్స్ మూత… అన్న క్యాంటీన్లకు తాకిడి

image

AP: నిన్న మొన్నటి వరకు కొద్దోగొప్పో తెరిచి ఉన్న హోటళ్లు వాణిజ్య LPG కొరతతో మూతపడుతున్నాయి. ఆ ప్రభావం అన్న క్యాంటీన్లపై పడుతోంది. ఇదివరకు ఒక్కో క్యాంటీన్‌ ద్వారా మధ్యాహ్నం 500మందికి మీల్స్ అందించేవారు. హోటల్స్ మూతతో అదనంగా 150 మీల్స్ సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో 3PM వరకు మీల్స్ అందించగా ఇప్పుడు ఉద్యోగులు, విద్యార్థులూ వస్తుండడంతో 2PMకల్లా భోజనాలు అయిపోతున్నట్లు చెబుతున్నారు.

News March 17, 2026

ఇరాన్ ప్రజలకు ఇదే మంచి అవకాశం: నెతన్యాహు

image

తమ దాడిలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. అలాగే ‘బసిజ్’ పారామిలిటరీ చీఫ్ గోలమ్‌రెజా సులేమానీ సైతం ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇరాన్‌లో తమ దాడులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని ఇరాన్ ప్రజలకు కల్పించాలనే ఆశతోనే ఈ అటాక్స్ చేస్తున్నామని పేర్కొన్నారు. అన్నీ ఒకేరోజులో జరగవని.. స్థిరంగా పోరాడితే అన్నీ సాధ్యమేనన్నారు.