News March 28, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు.. అదుపులో మరో ఇద్దరు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, సీఐ గట్టు మల్లుపై ఆరోపణలు రావడంతో వారిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ సమక్షంలో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసులో మాజీ పోలీస్ ఉన్నతాధికారులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావులకు రిమాండ్ విధించారు.
Similar News
News December 23, 2025
BHPL: హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు

హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు విధిస్తూ BHPL కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కాటారం(M) గంగారంలో భూమి తగాదాల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో 9 మందికి ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ న్యాయస్థానం, BHPL న్యాయమూర్తి సీహెచ్ రమేశ్ బాబు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
నిందితులు: మహంకాళి నాయక్, భాస్కర్ నాయక్, సర్దార్ నాయక్, బాపు నాయక్, కౌసల్య, సారయ్య నాయక్, బాబు నాయక్, సమ్మయ్య అజ్మీర రాజ్ కుమార్.
News December 23, 2025
శివాజీ కామెంట్స్.. మహిళా కమిషన్ వార్నింగ్!

సినీ వేడుకల్లో యాక్టర్లు జాగ్రత్తగా మాట్లాడాలని TG మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. మహిళల్ని అవమానించేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై <<18648181>>వివాదాస్పద కామెంట్స్<<>> చేసిన శివాజీకి నోటీసులు జారీ చేశారు. ఆయన వ్యాఖ్యలను లీగల్ టీమ్ పరిశీలించిందని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటు శివాజీ క్షమాపణలు చెప్పాలంటూ ‘MAA’ ప్రెసిడెంట్‌కు TFI వాయిస్ ఆఫ్ ఉమెన్ గ్రూప్ లేఖ రాసింది.
News December 23, 2025
విద్యార్థుల కోసం పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్: సీఎం

AP: యువతకు క్వాంటం టెక్నాలజీ కోర్సులను అందించనున్నట్లు CM CBN తెలిపారు. IIT మద్రాస్ ప్రతినిధులతో భేటీలో మాట్లాడుతూ ‘JAN చివరికల్లా క్వాంటం టెక్నాలజీపై సిలబస్ రూపొందించాలి. స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఇన్నోవేషన్స్ ప్రదర్శించేలా JANలో పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తాం. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఆలోచన వారిలో కలిగించేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి’ అని పేర్కొన్నారు.


