News July 22, 2024
PHOTO: అసెంబ్లీ బయట నల్లకండువాతో నెల్లూరు జిల్లా నేతలు

ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన TDP, YCP MLAలు, MLCలు అమరావతికి చేరుకున్నారు. పసుపు షర్టులతో TDP MLAలు సభలోకి ప్రవేశించారు. మరోవైపు MLCలు కళ్యాణ్ చక్రవర్తి, మురళీధర్, చంద్రశేఖర్ రెడ్డి నల్ల కండువా ధరించి YCP అధినేత జగన్‌తో కలిసి రాష్ట్రంలోని హత్యలపై నిరసన తెలిపారు. తర్వాత అసెంబ్లీలోకి వెళ్లినా.. కాసేపటికే సభను వాకౌట్ చేసి బయటకు వచ్చారు.
Similar News
News December 9, 2025
జిల్లాలో 15, 16న ఎస్టిమేట్స్ కమిటీ పర్యటన: కలెక్టర్

రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ఈనెల 15, 16న రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈనెల 15 సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారన్నారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌లో తనతోపాటు ఇతర అధికారులతో ఎస్టిమేట్స్ కమిటీ 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సం.ల బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.
News December 9, 2025
రేపటి నుంచి టెట్ పరీక్షలు: నెల్లూరు DEO

రేపటి నుంచి ఈనెల 21 వరకు టెట్-2025 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు ఆన్లైన్‌లోనే పొందవచ్చని పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.
News December 9, 2025
నెల్లూరు: విద్యార్థులకు మరో అవకాశం.!

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ కే.సునీత తెలిపారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఇంకా భర్తీ కాని సీట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షకు రాకపోయినా సీట్లు పొందే అవకాశం ఉన్నందున ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


