News July 22, 2024
PHOTO: అసెంబ్లీ బయట నల్లకండువాతో పెద్దిరెడ్డి
ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన TDP, YCP MLAలు,MLCలు అమరావతికి చేరుకున్నారు. పసుపు షర్టులతో TDP MLAలు సభలోకి ప్రవేశించారు. మరోవైపు మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నల్ల కండువా ధరించి YCP అధినేత జగన్‌తో కలిసి రాష్ట్రంలోని హత్యలపై నిరసన తెలిపారు. తర్వాత అసెంబ్లీలోకి వెళ్లినా.. కాసేపటికే సభను వాకౌట్ చేసి బయటకు వచ్చారు.
Similar News
News October 13, 2024
పేరూరు వద్ద 108 ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి
తిరుపతి రూరల్ మండలం పేరూరు జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ దాటుతున్న బైక్‌ను 108 వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు పేరూరుకు చెందిన రిటైర్డ్ అగ్రికల్చర్ ఉద్యోగి సుబ్రమణ్యం రెడ్డిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2024
పలమనేరు : 17న జాబ్ మేళా
APSSDC ఆధ్వర్యంలో 17వ తేదీన పలమనేరు పట్టణంలోని SVCR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 2 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, బి ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక, పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 13, 2024
తిరుపతిలో పెరిగిన చికెన్ అమ్మకాలు
గత నెల రోజులుగా పెరటాసి మాసం కారణంగా మాంసం అమ్మకాలు భారీగా తగ్గాయి. పెరటాసి మాసం ముగియడంతో ఆదివారం ఉదయం నుంచి మాంసం అమ్మకాలు జోరందుకున్నాయి. తిరుపతిలో చికెన్ ధరలు బాయిలర్, లింగాపురం రూ.240, లైవ్ రూ.150, స్కిన్ లెస్ చికెన్ రూ.260 కాగా గుడ్లు రూ.4.50 పైగా అమ్మకాలు సాగుతున్నాయి. త్వరలో కార్తీక మాసం కాగా అమ్మకాలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.