News February 18, 2025
PHOTO: క్రికెట్ ఆడిన మంత్రి బీసీ

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండలో మంగళవారం పర్యటించారు. కేఈ మాదన్న మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా నిర్వహిస్తోన్న క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, MLA కేఈ శ్యామ్ బాబులతో కలిసి ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మంత్రి బీసీ క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు.
Similar News
News December 5, 2025
వాస్తు అంటే ఏమిటి? దాని పాత్ర ఏంటి?

వాస్తు అనేది ఇంటిని వాస్తవాలకు అనుగుణంగా అమర్చే శాస్త్రమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు అంటున్నారు. ‘ప్రతి మనిషికి అత్యవసరమైన సుఖం, సంతోషం, తృప్తి ఒక నివాసంలో లభించాలి. వాస్తు నియమాలు ఈ ఆశయాలను చేరుకోవడానికి సరైన దిశను సూచిస్తాయి. ఇవి ఇల్లు నిర్మాణంలో, సర్దుబాటులో నియమాలను పాటించేలా చేసి, మన జీవితంలో సాఫల్యాన్ని, మంచి ఫలితాలను అందిస్తాయి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 5, 2025
బిగ్గెస్ట్ డీల్: నెట్ఫ్లిక్స్ సొంతమైన ‘Warner Bros’

ఎంటర్టైన్మెంట్ రంగంలోనే భారీ డీల్ అమల్లోకి వచ్చింది. Warner Bros టెలివిజన్ స్టూడియోస్, HBO, HBO MAXలను $82.7bn(₹7.44L Cr)కు కొనుగోలు చేసినట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఒక్కో షేర్ను $27.75గా లెక్కగట్టినట్లు పేర్కొంది. ఈ డీల్ 2026 Q3లో పూర్తవుతుందని తెలిపింది. దీంతో లక్షల గంటల WB కంటెంట్ నెట్ఫ్లిక్స్లో దొరకనుంది. ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేయడమే తమ లక్ష్యమని సంస్థ co-CEO సరండోస్ అన్నారు.
News December 5, 2025
ASF: జిల్లాలో మొదటి రాండమైజేషన్ పూర్తి

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి రాండమైజేషన్ పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శుక్రవారం ASF జిల్లా కలెక్టరేట్ సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్ సమక్షంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి రాండమైజేషన్ నిర్వహించారు.


