News February 18, 2025

PHOTO: క్రికెట్ ఆడిన మంత్రి బీసీ

image

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండలో మంగళవారం పర్యటించారు. కేఈ మాదన్న మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా నిర్వహిస్తోన్న క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, MLA కేఈ శ్యామ్ బాబులతో కలిసి ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మంత్రి బీసీ క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు.

Similar News

News April 14, 2026

DANGER: వేసవిలో ఇవి తింటే..

image

సమ్మర్‌లో అధిక నూనె ఉండే బజ్జీలు, పకోడీలు, చిప్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల అలసట, ఎసిడిటీ వస్తాయని, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. అలాగే స్వీట్లు, ప్యాకేజ్డ్ జ్యూసులు, షుగర్ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ తాగొద్దని, వీటి వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని సూచించారు.

News April 14, 2026

image

https://d29i5havsxvi1j.cloudfront.net/sticky_jsps/result_whatsap_push.jsp?token={TOKEN}

News April 14, 2026

ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

image

AP: కడప(D) ఒంటిమిట్టలో ఇవాళ 45°C ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల(D) సంజామల 44.2°C, తిరుపతి(D) వరదయ్యపాలెంలో 43.8°C ఉష్ణోగ్రత నెలకొంది. 262 మండలాల్లో 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు SDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.