News February 13, 2026
PHOTO: మనవడు, మనుమరాళ్లతో చిరు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కవలల బారసాల వేడుక ఫొటోను మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. వీరికి శివరామ్, అన్వీరా దేవిగా నామకరణం చేసినట్లు తెలిపారు. తన పేరు (శివ శంకర వరప్రసాద్), రామ్ చరణ్ పేర్ల కలయికతో ‘శివరామ్’ అని, కనకదుర్గమ్మ ఆశీస్సులతో భయం లేని తత్వాన్ని, దైవిక రక్షణను సూచించేలా అన్వీరా దేవి పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ చిన్నారులపై అందరి దీవెనలు ఉండాలని కోరారు.
Similar News
News March 9, 2026
నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు: సంజూ తండ్రి

భారత్ ప్రపంచకప్ గెలవడం ఆనందంగా, గర్వంగా ఉందని సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ తెలిపారు. ‘సంజూ కోసం దేశంలో చాలా మంది ప్రార్థించారు. ఇప్పుడు వారంతా సంతోషంగా ఉంటారు. సెమీఫైనల్లో 250 రన్స్ చేసినా మనం 6-7 రన్స్ తేడాతోనే గెలిచాం. నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు. దాని కోసం 1-2 బాల్స్ కూడా మిస్ చేయకూడదు’ అని చెప్పారు.
News March 9, 2026
‘కల్కి’ కోసం కమల్ హాసన్‌కు రోజుకు ₹15 కోట్లు?

‘కల్కి 2898 AD’ సినిమాలో సుప్రీమ్ యాష్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ రెమ్యునరేషన్‌పై SMలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన కేవలం 10 రోజుల షూటింగ్ కోసం ఏకంగా ₹150 కోట్లు తీసుకున్నారని నటుడు యుగి సేతు అన్నారు. అంటే రోజుకు దాదాపు ₹15 కోట్లు అన్నమాట. అయితే చిత్ర బృందం మాత్రం దీన్ని కొట్టిపారేసినట్లు సమాచారం. ఇది రూమర్ మాత్రమేనని.. కమల్ పారితోషికం ఇంత భారీ స్థాయిలో ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
News March 9, 2026
బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర ₹1500

ఇరాన్ యుద్ధం కారణంగా భారత్‌లో LPG సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. కొన్ని చోట్ల (UP) బ్లాక్ మార్కెట్‌లో ధర ₹1,500కు చేరింది. యుద్ధం నేపథ్యంలో మార్చి 7న డొమెస్టిక్ సిలిండర్ ధర ₹60 పెరగడంతో ప్రజలు భయంతో పానిక్ బయింగ్ మొదలుపెట్టారు. దీనివల్ల గ్యాస్ ఏజెన్సీల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వం 2 సిలిండర్ బుకింగ్‌ల మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే రూల్ తీసుకొచ్చింది.


