News December 27, 2024

PHOTO: వంజంగిలో ఎర్రబడ్డ ఆకాశం

image

అల్లూరి ఏజెన్సీ విభిన్న వాతావరణాలకు నిలయం. ఇక్కడ ఏ సమయంలో వాతావరణం ఏ రకంగా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అందుకు నిదర్శనమే ఈ దృశ్యం. ఎప్పుడూ మేఘాలతో ఉండే పాడేరు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి పరిసర ప్రాంతాల్లో గురువారం ఆకాశం ఎర్రగా మారింది. దీంతో స్థానికులు, పర్యాటకులు ఆశ్చర్యానికి లోనై తమ సెల్ ఫోన్ కెమెరాలలో ఈ దృశ్యాల్ని బంధించి ఆందించారు.

Similar News

News December 6, 2025

విశాఖలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్‌లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌తో పాటు EROలు, AEROలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ శనివారం ప్రత్యేకంగా సమీక్షించారు. 2002 నాటి జాబితాను 2025తో సరిపోల్చాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 24.54% మ్యాపింగ్ పూర్తైనట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వివరించారు. వలసల వల్ల క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నాయని అధికారులు ఆయనకు వివరించారు.

News December 6, 2025

విశాఖ: రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖలో 12 రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శనివారం తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఖాళీ అవుతున్న 25 డ్వాక్రా మహిళలు, ఆరు PHC స్టాల్స్‌కు డిసెంబర్ 7 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను గోపాలపట్నం మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో అందజేయాలి.

News December 6, 2025

విశాఖలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంఖుస్థాపన

image

విశాఖ తూర్పు నియోజకవర్గం ముడసర్లోవలో రూ.62 కోట్లతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు ఎంపీ శ్రీభరత్, విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి శంఖుస్థాపన చేశారు. రాష్ట్రానికి మంజూరైన 5 హాస్టళ్లలో 3 విశాఖకే దక్కడం విశేషం. సీఎం చంద్రబాబు కృషి, కేంద్ర నిధుల సద్వినియోగంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని విప్ చిరంజీవిరావు తెలిపారు. ఈ ఐదంతస్తుల భవనం ఉద్యోగినులకు సురక్షిత వసతిని అందిస్తుందన్నారు.