News October 20, 2024
PHOTO: విశాఖ బీచ్‌లో ఆహ్లాదపరిచిన ఆకాశం

ఆకాశంలో అందాలు అబ్బురపరిచాయి. ఆదివారం రోజంతా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజానీకానికి సాయంత్రం ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సాయంత్రం సూర్యాస్తమయం వేళ ఆకాశంలో మేఘాలు అబ్బురపరిచాయి. విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో సాయంత్రం ఆకాశంలో ఏర్పడిన అద్భుతమైన దృశ్యాలు ఆహ్లాదపరిచాయి. ఈ అందాలను పలువురు తమ సెల్ ఫోన్‌లో బంధించారు.
Similar News
News July 11, 2025
విశాఖలో మెట్రోకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన: గండి బాబ్జి

విశాఖలో మెట్రోకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేపట్టనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి వెల్లడించారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఉమ్మడి విశాఖలోని సుమారు 300 గ్రామాల్లో గంజాయి సాగును నిర్మూలించి ఉద్యానవనాల పెంపునకు కృషి చేస్తున్నామన్నారు.
News July 11, 2025
విశాఖలో ఈసాయ్ సంస్థ విస్తరణ

విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి నాటికి ఈ కేంద్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే జేఎన్ ఫార్మా సిటీలో తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఈసాయ్ సంస్థ ఈ కొత్త కేంద్రంతో భారత్‌లో తన ఉనికిని మరింతగా బలోపేతం చేయనుంది.
News July 11, 2025
షీలానగర్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

షీలానగర్ సమీపంలోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడకు చెందిన అశోక్ రెడ్డి బైకుపై వెళుతుండగా ట్రాలర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఇదే ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.