News October 4, 2025

PHOTO: ఆటో డ్రైవర్ గెటప్‌లో హోంమంత్రి

image

హోం మంత్రి వంగలపూడి అనిత ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆటో డ్రైవర్ సీట్‌లో కూర్చున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ అతిథి గృహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఆటోలో ప్రయాణం చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన ఆమె వారికి చెక్కు అందజేశారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన కూటమి ప్రభుత్వం కొత్తగా ఈ పథకాన్ని అమలు చేసి ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిందన్నారు.

Similar News

News October 4, 2025

BREAKING: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు

image

TG: హైదరాబాద్, సికింద్రాబాద్‌ పరిధిలో బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈనెల 6నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. మొదటి 3 స్టేజీల వరకు రూ.5 చొప్పున, 4వ స్టేజీ నుంచి రూ.10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఇ-ఆర్డినరీ, ఇ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పెంచిన ఛార్జీలు అమలుకానున్నాయి.

News October 4, 2025

విశాఖ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

image

విశాఖలోని అన్నదాన కార్యక్రమంలో గంజిపడి <<17913036>>చిన్నారులు గాయపడిన<<>> ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులను ఆస్పత్రికి తరలించగా, ఆరుగురు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. స్వల్ప గాయాలైన ఇతరులను డిశ్చార్జ్ చేశామని, బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్ వెల్లడించారు.

News October 4, 2025

పామాయిల్ సాగులో తెలంగాణ దేశానికే ఆదర్శం: మంత్రి తుమ్మల

image

దమ్మపేట మండలం లింగాలపల్లిలో జరిగిన తెలంగాణ పామాయిల్ రైతుల సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పామాయిల్ సాగులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సాంప్రదాయ పంటలైన పత్తి, మిర్చితో పోలిస్తే పామాయిల్ సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నారు.