News October 20, 2024

PHOTO: విశాఖ బీచ్‌లో ఆహ్లాదపరిచిన ఆకాశం

image

ఆకాశంలో అందాలు అబ్బురపరిచాయి. ఆదివారం రోజంతా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజానీకానికి సాయంత్రం ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సాయంత్రం సూర్యాస్తమయం వేళ ఆకాశంలో మేఘాలు అబ్బురపరిచాయి. విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో సాయంత్రం ఆకాశంలో ఏర్పడిన అద్భుతమైన దృశ్యాలు ఆహ్లాదపరిచాయి. ఈ అందాలను పలువురు తమ సెల్ ఫోన్‌లో బంధించారు.

Similar News

News November 7, 2025

రూ.10 లక్షల కోట్ల ఒప్పందాలు.. 7.30 లక్షల ఉద్యోగుల కల్పన

image

రాష్ట ప్రభుత్వం ఈ నెల 14, 15న నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసి పది లక్షల కోట్ల ఒప్పందాలు, 7.30 లక్షల ఉద్యోగుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామని స్వచ్ఛంద కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. GVMC ప్రధాన కార్యాలయంలో సదస్సుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. జీరో వేస్ట్ కాన్సెప్ట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కే బాటిల్స్ వినియోగిస్తున్నామన్నారు.

News November 6, 2025

‘గూగుల్ సెంటర్‌తో వందల సంఖ్యలోనే ఉద్యోగాలొస్తాయి’

image

విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తే లక్షల్లో ఉద్యోగాలు రావని, వందల సంఖ్యలో మాత్రమే ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింత మోహన్ అన్నారు. సుందర్ పిచాయ్ పేదవాడు కాదని అపర కోటీశ్వరుడన్నారు. 500 ఎకరాలు ఇచ్చి భూములతో వ్యాపారం చేయడం చంద్రబాబుకు పిచాయ్‌కి మధ్య ఉన్న బంధం ఏంటో వెల్లడించాలన్నారు. ఈనెల 31లోపు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదని కేంద్రం ప్రకటన చేయలన్నారు.

News November 6, 2025

విశాఖ: మహిళలను కాపాడిన లైఫ్ గార్డ్స్

image

RK బీచ్ గోకుల్ పార్క్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న మహిళలను లైఫ్ గార్డ్స్ కాపాడారు. గురువారం ఉదయం మహారాణి పేటకు చెందిన కీర్తి ఉషారాణి, సునీత పూజా సామాగ్రిని సముద్రంలో వదలడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కెరటాల తాకిడికి సముద్రం లోపలికి వెళ్లిపోతుండగా లైఫ్ గార్డ్స్ గమనించి వారిని రక్షించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.