News February 8, 2025

PHOTO: అల్లు అర్జున్ సూపర్ లుక్

image

‘పుష్ప-2’ కోసం గడ్డం పెంచిన అల్లు అర్జున్ ఈ మధ్యనే లుక్ మార్చారు. పుష్ప-2 థాంక్యూ మీట్‌లో సందడి చేసిన ఆయన గడ్డం ట్రిమ్ చేసి మరింత స్టైలిష్‌గా కనిపించారు. పుష్ప-2 రిలీజ్ తర్వాత పలు ఘటనలతో ఆయన మీడియాకు దూరమయ్యారు. ఈ క్రమంలో తాజా లుక్ అదిరిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆయన తదుపరి చిత్రంపై ప్రకటన మార్చిలో వచ్చే అవకాశముంది.

Similar News

News March 17, 2026

మన సైనికుల ప్రాణాల కంటే ట్రోఫీ ముఖ్యమా?.. SRHపై గవాస్కర్ ఫైర్

image

‘The Hundred’ కోసం అబ్రార్(PAK)ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనడాన్ని సునీల్ గవాస్కర్ తప్పుపట్టారు. ‘మనం చెల్లించే డబ్బు పరోక్షంగా IND సైనికుల మరణాలకు కారణమవుతుంది. అందుకే IPL టీమ్‌లు పాక్ ప్లేయర్లను తీసుకోవట్లేదు. కోచ్ వెటోరీకి ఈ విషయం అర్థం కాకపోవచ్చు. ఓనరైనా అడ్డుకోవాల్సింది. భారతీయుల ప్రాణాల కంటే ట్రోఫీ ముఖ్యమా? SRHను అభిమానులు బాయ్‌కాట్ చేయొచ్చు. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోవాలి’ అని సూచించారు.

News March 17, 2026

ఆరేళ్ల పదవీ కాలం.. ఒక్క ప్రశ్నా అడగలేదు!

image

మాజీ CJI జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభ MP పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఆరేళ్లలో ఆయన అటెండెన్స్ 53% ఉండగా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. 2023లో AUGలో ఢిల్లీ సర్వీసెస్ బిల్‌పై చర్చలో మాత్రమే పాల్గొన్నారు. కాగా 2020 మార్చి 16న ఆయనను RSకు కేంద్రం నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ‘నేను ముఖ్యమైన అంశాలు అని భావించినప్పుడు మాట్లాడతాను. నన్ను ఏ పార్టీ నియంత్రించలేదు’ అని 2021లో ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

News March 17, 2026

హైదరాబాద్‌లో UK స్కూల్స్!

image

TG: హైదరాబాద్‌లో యునైటెడ్ కింగ్‌డమ్(UK)కు చెందిన 13 ప్రఖ్యాత స్కూల్స్ తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. ఇందులో భాగంగా యూకే డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 18న రాష్ట్రంలో పర్యటించనుంది. ఎక్కడెక్కడ క్యాంపస్‌లు నెలకొల్పాలనే దానిపై రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరపనుంది.