News September 10, 2025

PHOTO: మనవడితో చిరంజీవి

image

వరుణ్, లావణ్య దంపతులు మగబిడ్డకు జన్మనివ్వడంపై చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. కొణిదెల కుటుంబంలోకి చిన్నారికి స్వాగతం పలుకుతూ వరుణ్-లావణ్యకు అభినందనలు తెలిపారు. నాగబాబు-పద్మజ.. నానమ్మ-తాతయ్యగా ప్రమోట్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు. చిన్నారి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో చిన్నారితో దిగిన ఫొటోను షేర్ చేశారు. అటు భార్య, కుమారుడితో కలిసి ఉన్న ఫొటోను వరుణ్ పోస్ట్ చేశారు.

Similar News

News March 12, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 12, 2026

అలా అయితేనే యుద్ధం ముగుస్తుంది: ఇరాన్ అధ్యక్షుడు

image

రష్యా, పాక్ లీడర్లతో యుద్ధ పరిస్థితులపై చర్చించినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వెల్లడించారు. ప్రాంతీయ శాంతిని నెలకొల్పడానికి ఇరాన్ కట్టుబడి ఉందన్నారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ పెట్టిన షరతులకు US, ఇజ్రాయెల్ అంగీకరించాలన్నారు. ‘అంతర్జాతీయంగా ఇరాన్‌కు ఉన్న చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలి. జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలి’ అని Xలో పోస్ట్ చేశారు.

News March 12, 2026

ఈరోజు నమాజ్ వేళలు (12-3-2026) గురువారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.24 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.