News December 25, 2025

PHOTO GALLERY: క్రిస్మస్ సందడి

image

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ తదితర నగరాల్లో చర్చిలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇటు క్రైస్తవులు తమ ఇళ్లను కలర్‌ఫుల్ లైట్లతో డెకరేట్ చేశారు. క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోళ్లతో మార్కెట్లూ సందడిగా మారాయి.

Similar News

News December 25, 2025

కర్ణాటక ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న 60 మంది చిన్నారులు!

image

కర్ణాటక బస్సు <<18664780>>ప్రమాదం<<>> నుంచి ఓ స్కూల్ బస్సు త్రుటిలో తప్పించుకుంది. ఆ ప్రైవేటు బస్సు వెనకే ఇది కూడా వెళ్తున్నట్లు తెలిసింది. లారీ-బస్సు ఢీకొనడంతో స్కూల్ బస్సు డ్రైవర్ వెంటనే పక్కకు తిప్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో 60 మంది పిల్లలున్నారు. వారు బెంగళూరు నుంచి ఉత్తర కన్నడలోని దండేలికి ట్రిప్ వెళ్తున్నారు. మృతుల ఫ్యామిలీలకు ₹2 లక్షలు, క్షతగాత్రులకు ₹50 వేల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు.

News December 25, 2025

ప్రధాని మోదీ ‘క్రిస్మస్’ ప్రార్థనలు

image

క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పర్వదినాన దేశ పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలోని సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

News December 25, 2025

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్‌లో ఉద్యోగాలు

image

భోపాల్‌లోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్‌ 3 యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి ఎంఎస్సీ( సాయిల్ సైన్స్/అగ్రికల్చరల్ కెమిస్ట్రీ/ అగ్రికల్చరల్ ఫిజిక్స్/ప్లాంట్ ఫిజియాలజీ), NET/GATE అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iiss.icar.gov.in/