News February 25, 2026

PHOTO GALLERY: MLA, MLCల ‘ఆటవిడుపు’

image

AP: ఆటవిడుపులో భాగంగా 3 రోజులపాటు నిర్వహించే క్రీడా ఉత్సవాలు-2026లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందడి చేస్తున్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, 100 మీటర్ల పరుగు పందెం, వాలీబాల్, టెన్నికాయిట్ లాంటి పోటీల్లో తలపడ్డారు. 83 ఏళ్ల ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, 79 ఏళ్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం వయసుతో సంబంధం లేకుండా సత్తా చాటారు.

Similar News

News February 25, 2026

‘లుకౌట్’.. ఇది నేరస్థులను పట్టుకునే ఆయుధం

image

యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు ఈ నోటీసులు జారీ చేస్తారు. దీనివల్ల నిందితుడి వివరాలు అన్ని విమానాశ్రయాల్లోని ఇమిగ్రేషన్ అధికారులకు అందుతాయి. ఫలితంగా నిందితుడు విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా తిరిగి వచ్చినప్పుడు కూడా తెలిసిపోతుంది. పరారీలో ఉన్న నేరస్థులను పట్టుకోవడానికి ఇది ఒక శక్తిమంతమైన ఆయుధం.

News February 25, 2026

‘రామాయణ’ బడ్జెట్ రూ.4వేల కోట్లు: నిర్మాత

image

నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. ‘ఈ చిత్రంపై నేను రూ.4వేల కోట్లు పెట్టుబడి పెట్టా. పార్ట్-1 షూటింగ్ దాదాపు పూర్తయింది. మూవీ స్టార్ట్ చేసే ముందు తగినంత బడ్జెట్ ఉందా అని అందరూ అడిగారు. అప్పు తీసుకోకుండా ఫస్ట్ పార్ట్ పూర్తి చేశా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకూ తెలియట్లే. దానంతట అదే జరిగిపోతుంది’ అని పేర్కొన్నారు.

News February 25, 2026

పశ్చిమ బెంగాల్ పేరు అందుకే మారలేదా?

image

‘కేరళం’కు ఓకే చెప్పిన కేంద్రం పశ్చిమబెంగాల్ <<19232383>>పేరును<<>> పెండింగ్‌‌లో ఉంచడం చర్చనీయాంశమైంది. 1999లో తొలిసారి, మమతా బెనర్జీ వచ్చాక 2011లో ఓసారి.. 2016లో మూడు భాషల్లో వేర్వేరు పేర్లతో మరోసారి, 2018లోనూ ప్రపోజల్ పెట్టగా కేంద్రం తిరస్కరించింది. తగిన ప్రామాణికాలు లోపించడం వల్ల కేంద్రం రిజెక్ట్ చేసింది. బంగ్లా పేరు బంగ్లాదేశ్‌తో పోలి ఉండటంతో విదేశాంగ శాఖ కూడా దీనిపై అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.