News January 13, 2025
PHOTO: ఇందిరమ్మ ఇల్లు ఇలాగే ఉంటుంది!
TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ను ఆవిష్కరించారు. నెల రోజుల్లో దీన్ని నిర్మించారు. ఇందులో హాల్, కిచెన్, బెడ్ రూం (అటాచ్డ్ బాత్రూం) ఉంటాయి. ఈ స్కీంలో భాగంగా ఒక్క ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు ఇస్తుంది. జనవరి 26 నుంచి ఈ ఇళ్లు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని చెప్పారు.
Similar News
News January 13, 2025
కౌశిక్ రెడ్డిపై స్పీకర్కు సంజయ్ ఫిర్యాదు
TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేశారు. అధికారిక సమావేశంలో తనను దుర్భాషలాడారని, ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటానని ఆయనకు స్పీకర్ బదులిచ్చారు.
News January 13, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: సౌతాఫ్రికా టీమ్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం సౌతాఫ్రికా టీంను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
టీమ్: టెంబా బవుమా (C), ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, వన్ డర్ డస్సెన్, రికెల్టన్, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్, ముల్డర్, క్లాసెన్, కేశవ్ మహారాజ్, షంసీ, ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, నోర్ట్జే.
News January 13, 2025
తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి దారుణం!
AP: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో ఐదేళ్ల చిన్నారిని 13 ఏళ్ల బాలుడు (8వ తరగతి) అత్యాచారం చేశాడు. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాలుడు పోలీసులతో చెప్పినట్లు సమాచారం.