News March 17, 2024
PHOTO: ఒకే ఫ్రేమ్‌లో మోదీ, చంద్రబాబు, పవన్

AP: చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ-బీజేపీ-జనసేన నిర్వహిస్తోన్న సభా వేదికపైకి ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.
Similar News
News September 8, 2025
ఆసిఫాబాద్: ఈవీఎంలకు పటిష్ట భద్రత

ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రే తెలిపారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా సోమవారం ఆసిఫాబాద్‌లోని ఈవీఎం గోదామును గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయన పరిశీలించారు. గోదాము సీలు తెరిచి యంత్రాల భద్రతను నిర్ధారించుకున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు భద్రతా చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
News September 8, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని హెచ్చరించింది.
News September 8, 2025
మూసీని ప్రక్షాళన చేయొద్దా: రేవంత్

TG: గంగా, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చు కానీ తాము మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దా అని సీఎం <<17649892>>రేవంత్<<>> రెడ్డి ప్రశ్నించారు. ‘పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. ఇందుకు అందరూ కలిసి రావాలని కోరుతున్నా. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది’ అని స్పష్టం చేశారు.