News October 18, 2024
PHOTO: బాబు, పవన్‌తో మోదీ

హరియాణాలోని చండీగఢ్‌లో నిన్న జరిగిన NDA నేతల మీటింగ్‌లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో మోదీ, బాబు, పవన్‌లు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. మీటింగ్ హాల్లో పవన్‌ను చూసిన మోదీ ఆయనతో ఆప్యాయంగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. పక్కనే బాబు కూడా ఉండగా ముగ్గురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.
Similar News
News October 12, 2025
GNT: జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

మంగళగిరి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుంటూరు వైపు నుంచి విజయవాడకు స్కూటీపై వెళ్తున్న వారిని లారీ ఢీకొట్టింది. దీంతో వారు రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో భారీ వాహనం వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీసులు విచారణ చేపట్టారు.
News October 12, 2025
3500 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కెనరా బ్యాంకులో 3500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏపీలో 242, తెలంగాణలో 132 పోస్టులు ఉన్నాయి. వయసు 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్రోల్ చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.15వేలు స్టైపండ్ ఇస్తారు. వెబ్సైట్: https://www.canarabank.bank.in
News October 12, 2025
చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్‌లో స్కిన్లెస్ చికెన్ ధర రూ.210-240 వరకు పలుకుతోంది. వరంగల్‌లో రూ.220, కర్నూలు, నంద్యాలలో రూ.200-240, ఏలూరులో రూ.220, గుంటూరులో రూ.200, ఎన్టీఆర్ జిల్లాల్లో రూ.270, శ్రీకాకుళంలో రూ.240గా ఉంది. మీ ఏరియాలో ధర ఎంత ఉంది? కామెంట్ చేయండి.