News February 7, 2025

ఫొటోల మార్ఫింగ్ కేసు.. విచారణకు హాజరైన RGV

image

AP: కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆయనపై కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులివ్వడంతో ఒంగోలు రూరల్ పీఎస్‌లో ఇవాళ విచారణకు హాజరయ్యారు.

Similar News

News February 7, 2025

పేదలకు రూ.40 వేల ఇంజెక్షన్ ఉచితం: టీడీపీ

image

AP: గుండెపోటుకు గురైన పేషంట్ ప్రాణం నిలిపేందుకు మొదటి గంటలోపే ‘టెనెక్టెప్లేస్-40’ అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ ట్వీట్ చేసింది. రూ.40 వేల నుంచి రూ.45 వేల విలువైన ఈ టీకాను పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇది అందుబాటులో ఉందని తెలిపింది.

News February 7, 2025

రేపే CCL ప్రారంభం.. తొలి మ్యాచ్ ఎవరికంటే?

image

సినీ, క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మొదలు కానుంది. రేపు తెలుగు వారియర్స్‌కు, కర్ణాటక బుల్డోజర్స్‌కు మధ్య బెంగళూరులో సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ జరగనుంది. అంతకుముందు మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై రైనోస్ vs బెంగాల్ టైగర్స్ మ్యాచ్ జరగనుంది. కాగా 14, 15వ తేదీల్లో హైదరాబాద్‌లో నాలుగు మ్యాచులున్నాయి. రేపు జరిగే మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.

News February 7, 2025

ఘోరం.. బాలికపై సామూహిక అత్యాచారం

image

TG: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఐదుగురు యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!