News September 17, 2024

PHOTO OF THE DAY

image

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. కాసేపటి క్రితమే శోభాయాత్ర ముగిసింది. ఖైరతాబాద్ నుంచి మొదలైన ఊరేగింపు సెక్రటేరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగింది. ఈక్రమంలో సచివాలయం ముందు మహాగణపతిని కెమెరాలో బంధించిన ఫొటో వైరల్ అవుతోంది. ఇది ఫొటో ఆఫ్ ది డే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని ఫొటోలకు ఇమేజ్ పక్కన క్లిక్ చేయండి.

Similar News

News January 7, 2026

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?

image

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదని వైద్యులు చె‌బుతున్నారు. ‘అలా చేస్తే కడుపులోని జీర్ణ రసాలు పలుచబడతాయి. దీంతో ఫుడ్ సరిగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. నీటి అధిక పరిమాణం కడుపులో ఒత్తిడిని పెంచి, ఆహారాన్ని అరిగించాల్సిన యాసిడ్‌ను అన్నవాహికలోకి నెడుతుంది. ఫలితంగా గుండెల్లో మంటకు కారణమవుతుంది. అందుకే తిన్న తర్వాత 30-60 నిమిషాలు ఆగి వాటర్ తాగాలి’ అని సూచిస్తున్నారు.

News January 7, 2026

గాయం నుంచి కోలుకొని అదరగొట్టిన శ్రేయస్

image

భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ VHTలో అదరగొట్టారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నిన్న ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన ఆయన 53 బంతుల్లోనే 82 రన్స్ చేశారు. అందులో 10 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. దీంతో ఈ నెల 11 నుంచి NZతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో శ్రేయస్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోవడం ఖాయమైనట్లే. గతేడాది AUSలో వన్డే మ్యాచ్ ఆడుతూ గాయపడిన శ్రేయస్ 2 నెలల పాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే.

News January 7, 2026

రష్యా నుంచి భారత్ దిగుమతులు రూ.17లక్షల కోట్లు

image

ఉక్రెయిన్‌తో పూర్తిస్థాయి యుద్ధం మొదలైన నాటి నుంచి సుమారు రూ.15 లక్షల కోట్ల విలువైన చమురు, రూ.1.91 లక్షల కోట్ల విలువైన బొగ్గు రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్నట్టు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంచనా వేసింది. చైనాకు 293.7 బిలియన్ యూరోల విలువైన చమురు, గ్యాస్, బొగ్గును రష్యా అమ్మింది. 2022 నుంచి ప్రపంచ శిలాజ ఇంధన అమ్మకాలతో రష్యా రూ.85-95 లక్షల కోట్లు సంపాదించినట్లు పేర్కొంది.