News December 25, 2024
Photo Of The Day: జగన్‌కు ప్రేమతో..!

మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటనలో ఆసక్తికర దృశ్యం జరిగింది. స్థానిక సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆయన తన తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విజయమ్మ ఆప్యాయంగా జగన్‌ను ముద్దాడింది. ఇదే ‘ఫొటో ఆప్ ది డే’ అంటూ వైసీపీ అభిమానులు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.
Similar News
News February 28, 2026
పుష్పగిరి: ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరులు

వల్లూరు మండలం పుష్పగిరి సంతాన మల్లేశ్వర ఆలయం వద్ద ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరుని రూపాలు ఉండటం అత్యంత అరుదని చరిత్రకారుడు బి.రమేష్ తెలిపారు. అర్చకులు అఖిల్ స్వామి సమాచారంతో పరిశోధించిన ఆయన ఈ శిల్పం పశుత్వం నుంచి దైవత్వానికి మారడాన్ని సూచిస్తుందన్నారు. చారిత్రక దాడుల్లో నంది ముఖం ధ్వంసమైనా లింగధారినంది, అద్భుతమైన హారాలు, అర్ధ పద్మాసనంలో ఉన్న నందికేశ్వరుని శిల్పకళ విశేషంగా ఆకర్షిస్తుందన్నారు.
News February 28, 2026
కడప జిల్లాలో నేటి ఇంటర్ పరీక్షలకు 4,470 మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ బోటనీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,626 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,470 మంది రాశారు. 156 మంది ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 3,473 మందికి గాను.. 3,383 మంది పరీక్షలకు హాజరయ్యారు. 93 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,153 మందికి గాను.. 1,087 మంది పరీక్షలు రాశారు. 66 మంది ఆబ్సెంట్ అయ్యారు.
News February 28, 2026
కడప జిల్లాలో నేటి ఇంటర్ పరీక్షలకు 4,470 మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ బాటనీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,626 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,470 మంది రాశారు. 156 మంది ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 3,473 మందికి గాను.. 3,383 మంది పరీక్షలకు హాజరయ్యారు. 93 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,153 మందికి గాను.. 1,087 మంది పరీక్షలు రాశారు. 66 మంది ఆబ్సెంట్ అయ్యారు.


