News October 31, 2025

PHOTO OF THE DAY: దూరదర్శినితో DGP, CP

image

బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. డేటా సెంటర్, స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, సీపీ కార్యాలయం, హెలిప్యాడ్‌ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. CP సజ్జనార్‌తో కలిసి దూరదర్శిని సాయంతో నగరాన్ని వీక్షించారు. వీరి వెంట ICCC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉన్నారు.

Similar News

News October 31, 2025

బాహుబలి యూనివర్స్‌లో కొత్త సినిమా ప్రకటన

image

బాహుబలి యూనివర్స్‌లో ‘బాహుబలి-ది ఎటర్నల్ వార్’ పేరిట 3D యానిమేటెడ్ మూవీ రాబోతోంది. ‘బాహుబలి-ది ఎపిక్’ సినిమా చివర్లో ఈ 3D మూవీ టీజర్‌ను థియేటర్లలో ప్లే చేశారు. 2027లో తొలి పార్ట్ రిలీజ్ కానుంది. కొత్త కథతో రూ.120కోట్ల బడ్జెట్‌తో దీనిని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా తెరకెక్కించనున్నారు. ఇందులో ఇంద్రుడు, బాహుబలి మధ్య యుద్ధాన్ని చూపిస్తారని తెలుస్తోంది.

News October 31, 2025

₹39,216 కోట్ల ఒప్పందాలపై విశాఖ పోర్టు సంతకాలు

image

AP: ముంబైలో జరిగిన మారిటైమ్ వీక్-2025 సమావేశాల్లో విశాఖపట్నం పోర్టు అథారిటీ(VPA) ₹39,216 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. దుగరాజపట్నంలో మేజర్ పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్&రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం AP ప్రభుత్వంతో ₹29,662 కోట్ల ఒప్పందం చేసుకుంది. మెకాన్ ఇండియాతో ₹3,000 కోట్లు, NBCCతో ₹500 కోట్లు, హడ్కోతో ₹487.38 కోట్లు, రైల్ వికాస్ నియమిటెడ్‌తో ₹535 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది.

News October 31, 2025

సిద్దిపేట: పేదింట్లో మెరిసిన ఆణిముత్యం

image

జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన దళిత బిడ్డ తప్పెట్ల సంధ్య హైడ్రో జియాలజిస్ట్‌గా ఎంపికయ్యారు. కూలి కుటుంబానికి చెందిన లక్ష్మి-సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె సంధ్య యూపీఎస్సీలో ఫలితాల్లో 29వ ర్యాంక్‌తో ప్రతిభ చాటింది. విద్య పేదరికం, పట్టుదల, కృషి, ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించవచ్చని సంధ్య నిరూపించింది. దీంతో ఆమెను గ్రామ ప్రజలు అభినందించారు.