News February 12, 2025
PHOTO OF THE DAY
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739348547096_746-normal-WIFI.webp)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు కొచ్చిలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో పవన్‌తో పాటు ఆయన కుమారుడు అకీరానందన్ కూడా ఉండటం విశేషం. తండ్రీకొడుకులు ఇద్దరూ సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చి నమస్కరిస్తున్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఫొటో ఆఫ్ ది డే అంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.
Similar News
News February 12, 2025
BCలకు సీఎం క్షమాపణలు చెప్పాలి: KTR
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738913170242_893-normal-WIFI.webp)
TG: బీసీల జనాభాను తగ్గించి వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేసిన CM రేవంత్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని KTR డిమాండ్ చేశారు. ‘సర్వే తప్పులతడక అని ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. <<15441710>>ఈసారైనా <<>>సమగ్రంగా సర్వే చేసి BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు జరపాలి. BC డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకూ కాంగ్రెస్‌ను BCలెవరూ నమ్మరని సీఎం గుర్తుపెట్టుకోవాలి’ అని KTR ట్వీట్ చేశారు.
News February 12, 2025
అమెరికాకు పయనమైన ప్రధాని మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368874903_1045-normal-WIFI.webp)
ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరారు. యూఎస్‌లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ట్రంప్ ఆ దేశాధ్యక్షుడయ్యాక మోదీకి ఇదే తొలి పర్యటన. ఈ సందర్భంగా అక్కడి వ్యాపారవేత్తలు, భారత ప్రవాసుల్ని ఆయన కలవనున్నారు. ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధం మరింత బలోపేతం చేసుకునే దిశగా మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
News February 12, 2025
స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739366328038_653-normal-WIFI.webp)
TG: 42% బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చాకే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని భట్టి విక్రమార్క తెలిపారు. అయితే కేంద్రం ఆమోదం తెలుపుతుందా? లేదా? తెలిపినా ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్చి తర్వాతే స్థానిక ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.