News February 8, 2025

PHOTO: రోజా కూతురు ర్యాంప్ వాక్

image

AP: మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక మల్టీ ట్యాలెంట్‌తో అదరగొడుతున్నారు. వెబ్‌ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన ఆమె తాజాగా ఫ్యాషన్ రంగంలోనూ రాణిస్తున్నారు. నైజీరియాలో జరిగిన ’గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌’లో ఆమె ర్యాంప్‌‌పై నడిచి ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్‌లో అన్షు షేర్ చేశారు. ఇటీవల ఆమె గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ అవార్డు సైతం అందుకున్నారు.

Similar News

News February 8, 2025

AAPకి అధికారం ఎందుకు దూరమైందంటే?

image

2015, 2020 ఎన్నికల్లో 70 స్థానాలకు 67, 62 స్థానాల్లో అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చిన AAPను ఈసారి పలు వివాదాలు చుట్టుముట్టాయి. హామీలు అమలు చేయకపోవడం, ఎయిర్ క్వాలిటీపై ప్రజల అసంతృప్తి, CM అధికార నివాసం శేష్ మహల్‌ను రూ.33.66 కోట్లతో అభివృద్ధి చేసుకోవడంపై ఆరోపణలు, AK అవినీతిపై BJP ప్రచారం, లిక్కర్ స్కాంలో AK, మంత్రులు, AAP నేతలు జైలుకెళ్లడంతో పాలన గాడితప్పి ఆ పార్టీని అధికారానికి దూరం చేశాయి.

News February 8, 2025

సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు!

image

చిత్ర విచిత్రమైన కారణాలతో వివాహాలను రద్దు చేసుకుంటున్నారు. తాజాగా వధువు కుటుంబం వరుడి సిబిల్ స్కోర్ తెలుసుకుని పెళ్లిని రద్దు చేసుకుంది. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లో అమ్మాయి, అబ్బాయి ఓకే చెప్పడంతో పెద్దలు వివాహం కుదిర్చారు. అయితే, అమ్మాయి మేనమామ అబ్బాయి CIBIL స్కోర్ చెక్ చేయాల్సిందేనని పట్టుబట్టాడు. అది చూసి అతను కాబోయే భార్యకు ఆర్థిక భద్రత కల్పించలేడని పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు.

News February 8, 2025

ఢిల్లీ ఫలితాలు.. కాంగ్రెస్ సమాధిపై మరో రాయి: సత్య కుమార్

image

AP: PM మోదీ పట్ల ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి ఢిల్లీ ఎన్నికల్లో BJP అఖండ విజయమే నిదర్శనమని మంత్రి సత్యకుమార్ అన్నారు. కేజ్రీవాల్‌తో సహా ఆప్ ముఖ్య నేతలను ఓడించి ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని స్పష్టమైన తీర్పు ఇచ్చారని ట్వీట్ చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అందలం ఎక్కించి.. అవినీతి, అబద్ధాలకు గుణపాఠం నేర్పారని తెలిపారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్ సమాధిపై మరో రాయిని పేర్చారని ఎద్దేవా చేశారు.

error: Content is protected !!