News August 22, 2025
PHOTO: కాబోయే కోడలితో సచిన్ ఫ్యామిలీ?

సచిన్ కొడుకు అర్జున్‌కు సానియా చందోక్‌తో ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు సచిన్ దీనిపై స్పందించలేదు. ఇవాళ ముంబైలో సారా తెందూల్కర్ ఫిట్‌నెస్ సెంటర్ ఓపెనింగ్‌కు సానియా హాజరయ్యారు. తెందూల్కర్ ఫ్యామిలీతో కలిసి ఆమె సెంటర్‌ను ప్రారంభించడం ఎంగేజ్మెంట్ వార్తలకు బలం చేకూరుస్తోంది. తర్వాత వారంతా కలిసి ఫొటోలు దిగారు. వీటిని స్వయంగా సచినే Xలో షేర్ చేశారు.
Similar News
News August 23, 2025
HEADLINES

* నేరస్థులు, అవినీతిపరులు అధికారంలో ఉండొద్దు: ప్రధాని మోదీ
* మోదీ ఓట్ చోర్ మహారాజ్: రాహుల్
* క్వాంటం వ్యాలీకి ఏపీ కేరాఫ్ అడ్రస్: CM చంద్రబాబు
* AP DSC మెరిట్ జాబితా విడుదల
* ఢిల్లీలో కుక్కల అంశంపై వెనక్కి తగ్గిన సుప్రీం.. స్టెరిలైజ్ చేసి వదిలేయాలని ఆదేశం
* తెలంగాణలో ప్రశాంతంగా ‘గో బ్యాక్ మార్వాడీ’ బంద్
* సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
News August 23, 2025
ఘోరం: కేక్ తినిపించిన చేతులతోనే..

TG: సహస్ర హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సహస్ర బర్త్ డే వేడుకలకూ హాజరైన బాలుడు ఆమెకు కేక్ తినిపించాడు. అదే చేతుల్తో బాలికను అత్యంత దారుణంగా హత్య చేయడం స్థానికులను షాక్‌కు గురిచేస్తోంది. కాగా సహస్ర ఇంట్లో <<17485132>>డబ్బులు దొంగిలించి<<>> క్రికెట్ బ్యాట్ కొనాలనుకున్నట్లు బాలుడు చెప్పినట్లు తెలుస్తోంది. క్రైమ్ వెబ్‌సిరీస్‌లు చూసే హత్య ఆలోచన వచ్చినట్లు చెప్పాడని సమాచారం.
News August 23, 2025
DSC అభ్యర్థులకు కీలక సూచనలు

AP: కాల్ లెటర్ అందిన DSC అభ్యర్థులకు కన్వీనర్ కృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు. ‘ఒరిజినల్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన 3సెట్ల సర్టిఫికెట్ల కాపీలు, 5పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ వెరిఫికేషను(CV)కు హాజరు కావాలి. ముందే వాటిని సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. CVకి తప్పనిసరిగా రావాలి. హాజరుకాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేస్తాం’ అని తెలిపారు.