News October 9, 2024
PHOTO: ‘సార్ పుణ్యమా అంటూ DSCలో జాబ్ వచ్చింది’ అని దండం

TG: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు. ‘సార్ పుణ్యమా అంటూ డీఎస్సీలో జాబ్ వచ్చింది’ అంటూ ఓ వ్యక్తి ఎల్బీ స్టేడియంలోని సీఎం ఫ్లెక్సీకి దండం పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Similar News
News January 30, 2026
మేడారం జాతర.. నేడు సెలవు

TG: మేడారం జాతర సందర్భంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీనికి బదులుగా ఫిబ్రవరి 14న (రెండో శనివారం) పనిదినంగా పరిగణించనున్నట్లు తెలిపారు. కాగా జాతరకు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వెళ్లనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కాగా జాతర రేపటితో ముగియనుంది.
News January 30, 2026
ఈ నూనెలతో స్కిన్ సేఫ్

శీతాకాలం రాగానే చర్మం తన సహజతేమను కోల్పోయి పొడిబారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే మొక్కల నుంచి తీసిన నూనెలు వాడాలని సూచిస్తున్నారు నిపుణులు. వీటిలోని ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మంపై రక్షణ కవచంలా ఏర్పడతాయి. ముఖ్యంగా జొజొబా ఆయిల్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, రోజ్షిప్ ఆయిల్, కొబ్బరి నూనెలు చర్మాన్ని సంరక్షించడంలో కీలకంగా పనిచేస్తాయంటున్నారు.
News January 30, 2026
కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు

☛ డబుల్ సెంచరీ: ఇది పొడుగు కొబ్బరి రకం. నాటిన ఆరేళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 130 కాయల దిగుబడి వస్తుంది. ఈ రకం కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గోదావరి గంగ: ఇది హైబ్రిడ్ కొబ్బరి రకం. నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 140-150 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 68 శాతం. ఇవి కొబ్బరి బొండానికి, టెంకాయకు మేలైన రకాలు.


