News September 1, 2024

PHOTO: బీచ్‌లో స్టార్ కపుల్స్

image

ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కర్ణాటకలోని కుందాపుర బీచ్‌లో సరదాగా గడిపారు. ఇరువురూ తమ సతీమణులతో కలిసి తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అంతకుముందు కుటుంబంతో కలిసి ఉడుపి శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్, ప్రశాంత్ కాంబోలో రానున్న సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ మూవీని 2026లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

Similar News

News November 3, 2025

ఈ వరి రకం.. ముంపు ప్రాంత రైతులకు వరం

image

MTU 1232.. ఇది 15 నుంచి 20 రోజుల పాటు వరద ముంపును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే వరి రకం. పంటకాలం 140 రోజులు. పైరు తక్కువ ఎత్తు పెరిగి, గింజ సన్నగా ఉంటుంది. బియ్యం శాతం అధికం. దోమ పోటు, అగ్గి తెగులు, మాగుడు తెగులును తట్టుకుంటుంది. ఇది పడిపోదు, గింజ రాలదు. ఎకరాకు సాధారణ భూమిలో 40 బస్తాలు, ముంపు ప్రాంతాల్లో 30-35 బస్తాల దిగుబడినిస్తుంది. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 3, 2025

బాడీ స్ప్రే ఎక్కువగా వాడుతున్నారా?

image

చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు బాడీ స్ప్రేలు వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల పలు సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే రసాయనం వల్ల దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటీస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యూలోనూ వంటి చర్మవ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్, పారాబెన్ లేని వాటిని వాడాలని సూచిస్తున్నారు.

News November 3, 2025

ఇతిహాసాలు క్విజ్ – 55

image

1. అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు?
2. విచిత్రవీర్యుని తండ్రి ఎవరు?
3. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎన్ని రోజులు ఎత్తి పట్టుకున్నాడు?
4. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలు ఏమంటారు?
5. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడాన్ని ఏమంటారు?
– సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>