News August 25, 2024
PHOTO: జైలులో స్టార్ హీరోకు VIP ట్రీట్మెంట్

హత్య కేసులో అరెస్టై బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న కన్నడ హీరో దర్శన్‌కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తున్నట్టుంది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైలులో పార్క్ లాంటి ప్రదేశంలో కూర్చొని చేతిలో గ్లాసు, సిగరెట్ పట్టుకొని దర్శన్ ఉల్లాసంగా గడుపుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫొటో జైలు లోపలిదా? కాదా? అనేది జైలు అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
Similar News
News January 30, 2026
విష్ణుమూర్తిని నేడు ఎలా పూజించాలంటే..?

వరాహ ద్వాదశి నాడు విష్ణుమూర్తిని స్మరించుకోవాలి. రాగి/ఇత్తడి చెంబులో గంగాజలం నింపి, అక్షితలు, పువ్వులు, మామిడి ఆకులతో అలంకరించాలి. పైన కొబ్బరికాయ ఉంచి కలశాన్ని సిద్ధం చేయాలి. ఈ కలశంపై వరాహ స్వామిని ప్రతిష్టించి షోడశోపచార పూజ చేయాలి. స్వామికి పసుపు వస్త్రాలు, తులసి దళాలు, బెల్లం నైవేద్యం సమర్పించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. పేదలకు దానాలు చేస్తే తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
News January 30, 2026
నేడే TG EAPCET-2026 షెడ్యూల్?

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే EAPCET(గతంలో ఎంసెట్)-2026 షెడ్యూల్‌ను JNTU ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19 లేదా 20న నోటిఫికేషన్, మార్చి తొలి వారంలో అప్లికేషన్లు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. కాగా మే 4,5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
News January 30, 2026
బంగారం డిమాండ్ తగ్గుతోంది: WGC

బంగారం ధర ఎఫెక్ట్ డిమాండ్‌పై పడింది. వివాహాల సీజన్ అయినా కొనుగోళ్లు పెరగకపోవడమే ఇందుకు ఉదాహరణ. గతేడాదితో పోలిస్తే ఈసారి డిమాండ్ తక్కువేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. 2024లో 802.8 టన్నుల అమ్మకాలు జరగ్గా 2025లో 11% తగ్గి 710.9 టన్నులకు చేరింది. ఈ ఏడాది అది 600-700 టన్నులే ఉండొచ్చని WGC అంచనా వేసింది. 2024లో కొనుగోళ్ల విలువ రూ.5.75లక్షల కోట్లు కాగా 2025లో అది రూ.7.51లక్షల కోట్లకు చేరింది.


