News August 20, 2025
కన్నీళ్లు పెట్టిస్తున్న PHOTO

TG: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లే ఆ పిల్లల ఊపిరి తీసింది. HYD శివారు బాచుపల్లిలో తల్లి లక్ష్మి తన ఇద్దరు పిల్లల(ఒకరు 8 నెలలు, మరొకరు మూడేళ్లు)ను నీటి సంపులో పడేసింది. అప్పటివరకు ఆనందంగా ఆడుకున్న ఆ చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు చిన్నారుల మృతదేహాలను వెలికితీయగా ఆ దృశ్యం చూసినవారిని కంటతడి పెట్టిస్తోంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 20, 2025
రాజ్యాంగ సవరణ బిల్లుకు కాంగ్రెస్ MP శశిథరూర్ మద్దతు

నేరం చేస్తే పీఎం, సీఎం, మంత్రులకు ఉద్వాసన పలికేలా కేంద్రం రూపొందించిన బిల్లుకు ప్రతిపక్ష ఎంపీ శశి థరూర్ మద్దతు పలికారు. ఆ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష సీఎంలను అన్యాయంగా అరెస్టు చేస్తే పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక ప్రశ్నించారు. అయితే అందుకు భిన్నంగా శశి థరూర్ స్పందిస్తూ ఆ బిల్లుల్లో లోపమేమీ లేదని అభిప్రాయపడ్డారు.
News August 20, 2025
నేనిప్పుడే రిటైర్ అవ్వను: నాగవంశీ

‘వార్-2’ సినిమాతో భారీ నష్టం వాటిల్లిందని, అందుకే సినిమాలు ఆపేసి నిర్మాత దుబాయ్‌కి వెళ్లిపోతున్నారంటూ వచ్చిన వార్తలను నాగవంశీ ఖండించారు. ఆ టైం ఇంకా రాలేదని, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు సారీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తాను రిటైర్ అయ్యేందుకు ఇంకా 10-15 ఏళ్లు పడుతుందని చెప్పారు. ఆల్ వేస్ ఫర్ సినిమాస్ అంటూ రాసుకొచ్చారు. తర్వాత సినిమా ‘మాస్ జాతర’తో మళ్లీ మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు.
News August 20, 2025
ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడితే శిక్ష పడుతుందా?

లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ <<17461749>>గేమింగ్ బిల్లు<<>> పాసైతే ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడే వారికి శిక్ష పడుతుందా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాళ్లు, బాధితులకు ఈ బిల్లు వల్ల ఎలాంటి శిక్షలు పడవని తెలుస్తోంది. ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ ఆర్గనైజర్స్, సర్వీస్ ప్రొవైడర్స్, అడ్వటైజర్స్, ప్రమోటర్స్, ఫైనాన్షియల్ సపోర్టర్స్‌కి మాత్రమే శిక్షలు పడే అవకాశం ఉంటుందని సమాచారం.