News July 16, 2024
PHOTO: హత్యాయత్నం తర్వాత ట్రంప్

కాల్పుల <<13624982>>ఘటనలో<<>> రెప్పపాటులో ప్రాణాలతో బయటపడిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. వీఐపీ బాక్స్‌లోని సీట్లో కూర్చున్నారు. బ్లూకలర్ సూట్‌తో పాటు తన ట్రేడ్ మార్క్ రెడ్ టై ధరించారు. చెవికి బ్యాండేజీతో ఆయన కనిపించారు. ఈ సదస్సులోనే ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్‌ను ఆయన ప్రకటించారు.
Similar News
News February 2, 2026
ప్లే ఆఫ్స్‌లోకి ఢిల్లీ మహిళల జట్టు

WPL-2026 లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ 122/8 పరుగులకే పరిమితం కాగా, ఢిల్లీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఢిల్లీ ఎల్లుండి గుజరాత్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఆర్సీబీ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.
News February 2, 2026
రికార్డులు చూసుకోండి పాక్..

భారత్‌తో మ్యాచ్‌ను <<19024958>>బహిష్కరిస్తున్నట్లు<<>> ప్రకటించిన పాక్ జట్టుపై ఇండియన్స్ సెటైర్లు వేస్తున్నారు. WCలలో INDపై పాక్ రికార్డు చెత్తగా ఉందని గుర్తు చేస్తున్నారు. ODI WCలలో ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ అన్నీ ఇండియానే గెలిచింది. T20ల్లో ఆడిన 8 పోరుల్లో 6 సార్లు ఇండియాదే విజయం. పాక్ ఒక మ్యాచే గెలవగా మరొకటి డ్రా అయ్యింది. మైదానంలో గెలవడం చేతకాకే పరువు కాపాడుకోవడానికి ఈ డ్రామాలు చేస్తోందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
News February 1, 2026
మహిళా సాధికారతకు సరికొత్త బాట ‘షీ మార్ట్’

కేంద్ర బడ్జెట్ 2026లో మహిళలను వ్యాపార యజమానులుగా మార్చేందుకు ‘షీ మార్ట్’ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సొంత రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదికి రూ.1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం పొందేలా మహిళలకు శిక్షణ, ఆర్థిక తోడ్పాటు అందించడమే ఈ పథకం లక్ష్యం. స్థానిక పొదుపు సంఘాల్లో చేరి, నైపుణ్య శిక్షణ పొంది, బ్యాంకు రుణాల ద్వారా తమ వ్యాపార కలను సాకారం చేసుకోవచ్చు.


