News December 10, 2024
ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల ఫొటోలు ప్రదర్శించాలి: విద్యాశాఖ

TG: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల ఫొటోలు, వివరాలను ఆయా స్కూళ్లలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నకిలీ టీచర్లు, ఫేక్ అటెండెన్స్‌ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వివరాలు ప్రదర్శించడం వల్ల టీచర్ల వివరాలు విద్యార్థులతో పాటు తనిఖీలకు వచ్చే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా తెలుస్తాయని భావిస్తోంది.
Similar News
News September 23, 2025
HEADLINES

*యూరియాతో ఆరోగ్యానికి తీవ్ర నష్టం: సీఎం చంద్రబాబు
*TG: సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్
*స్వదేశీ వస్తువులనే కొనండి: ప్రజలకు PM లేఖ
*TG: సింగరేణి కార్మికులకు రూ.1,95,610 చొప్పున బోనస్
*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం: బొత్స
*ENCOUNTER: మావోయిస్టు నేతలు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి హతం
News September 23, 2025
లోకేశ్ అన్న.. నువ్వు ఇచ్చిన బూట్లు ఏమయ్యాయి: అంబటి

AP: బడి పిల్లలకు చెప్పులు కొనిపెట్టిన పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ <<17786148>>వెంకటరత్నం<<>> వీడియోను మంత్రి లోకేశ్ SMలో షేర్ చేసిన విషయం తెలిసిందే. దానిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘లోకేశ్ అన్న.. నువ్వు ఇచ్చిన బూట్లు ఏమయ్యాయి? క్వాలిటీలేక పోయాయా? అసలు ఇవ్వకుండా మింగేశావా? ఏది ఏమైనా వెంకటరత్నం గారికి హాట్సాఫ్’ అని ట్వీట్ చేశారు.
News September 23, 2025
మృత్యుంజయుడు.. విమానం టైర్లలో ప్రయాణం

కాబూల్ (AFG)నుంచి ఢిల్లీ వరకు (గంటన్నర జర్నీ) ఓ 13 ఏళ్ల బాలుడు విమానం టైర్లలో దాక్కుని ప్రయాణించాడు. ఇరాన్‌కు పారిపోదామని పొరపాటుగా ఢిల్లీకి వెళ్లే RQ4401 విమానం టైర్ భాగంలో కూర్చున్నాడు. ఆ టైర్లతో పాటు
అతడూ లోపలికి వెళ్లి నక్కి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. లేదంటే 30వేల అడుగుల ఎత్తులో ఆక్సిజన్ అందక, గడ్డకట్టే చలిలో చనిపోయేవాడని చెప్పారు. బాలుడు మైనర్ కావడంతో కఠిన చర్యలు ఉండవని తెలిపారు.