News December 24, 2025
PHOTOS: పొలంలో సల్మాన్, ధోనీ

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మహారాష్ట్రలోని పన్వెల్ ఫామ్‌హౌస్‌లో భారత క్రికెట్ దిగ్గజం ధోనీ, సింగర్ ఏపీ ధిల్లాన్ సందడి చేసిన ఫొటోలు తాజాగా బయటకొచ్చాయి. వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్‌తో పొలం దున్నిన తర్వాత ఒళ్లంతా బురదతో ఉన్న సల్మాన్, ధోనీ కలిసి దిగిన ఫొటో తెగ వైరలవుతోంది. స్టార్స్ హోదాను పక్కనపెట్టి ప్రకృతి ఒడిలో వీరు గడపడంపై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Similar News
News December 25, 2025
మతం, ధర్మం.. రెండూ ఒకటేనా?

వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మతం ఓ నిర్దిష్ట దైవాన్ని పూజించే పద్ధతి. ఇది గ్రంథం, నమ్మకాల చుట్టూ తిరుగుతుంది. ఇది మనుషులు ఏర్పాటు చేసుకున్న ఓ వ్యవస్థ. కానీ ధర్మం అనేది విశ్వవ్యాప్తమైనది. ‘ధరించునది’ అని దీని అర్థం. అంటే సత్యం, అహింస, బాధ్యత, మానవత్వాన్ని పాటించడం. మతం మారవచ్చు కానీ ధర్మం (ఉదాహరణకు: తల్లిగా ధర్మం, మనిషిగా ధర్మం) ఎప్పటికీ మారదు. మతం వ్యక్తిగతమైనది. ధర్మం సామాజికమైన క్రమశిక్షణ.
News December 25, 2025
ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు హతం.. నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఒడిశా!

ఒడిశాలోని కందమాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీరిలో కేంద్ర కమిటీ సభ్యులు, నల్గొండ(D) పుల్లెంల వాసి గణేశ్ ఉయికె అలియాస్ పాక హన్మంతు ఉన్నారని తెలిపింది. 40 ఏళ్లుగా ఉద్యమంలో చురుగ్గా ఉన్న ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు ఉంది. ఒడిశా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని, వచ్చే ఏడాది మార్చి 31కల్లా దేశంలో నక్సలిజాన్ని అంతమొందిస్తామని పేర్కొంది.
News December 25, 2025
GOVT శాఖల విద్యుత్ బకాయి ₹35,982 కోట్లు

TG: ప్రభుత్వ విభాగాల విద్యుత్ బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. TGSPDCL, NPDCLలు నోటీసులు ఇస్తున్నా ఫలితం లేకపోతోంది. సాగునీటి శాఖ ₹22,926 కోట్లు, HYD వాటర్ బోర్డు ₹7,084 కోట్లు చెల్లించాలి. మిషన్ భగీరథ ప్రాజెక్టు విభాగం ₹5,972 కోట్లు కట్టాల్సి ఉంది. గత 5 ఏళ్లుగా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కాగా ఈ బకాయిల వసూలు బాధ్యతను కొత్తగా ఏర్పాటుచేసిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది.


