News January 21, 2025
PHOTOS: ఫ్యామిలీతో అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దిగిన కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భార్య స్నేహా రెడ్డితో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ వైట్ టీషర్టు ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. మొన్నటి వరకు ‘పుష్ప-2’ సినిమా కోసం హెయిర్, బియర్డ్ పెంచిన బన్నీ.. తాజాగా తన లుక్‌ను మార్చేసిన విషయం తెలిసిందే. కాగా, మార్చి నెల నుంచి త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా ప్రారంభం కానుంది.
Similar News
News November 16, 2025
లంచ్: 10కే 2 వికెట్లు డౌన్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా తడబడుతోంది. లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 10 రన్స్ చేసింది. భారత్ విజయానికి మరో 114 రన్స్ అవసరం. క్రీజులో సుందర్, జురేల్ ఉన్నారు. జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు.
News November 16, 2025
పెరుగుతో అందం పెంచేయండి..

చర్మ సమస్యలను తగ్గించడానికి పెరుగు పరిష్కారం చూపుతుంది. * అరటిపండు, తెల్లసొన, శనగపిండి, పెరుగు కలిపి ముఖానికి రాయాలి. దీనివల్ల మోము మృదువుగా మారుతుంది. * పెరుగు, మెంతి పొడి, బాదం నూనె, గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పెరుగులో రెండు చెంచాల ఓట్స్ పొడి వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఓట్స్ చర్మానికి క్లెన్సర్‌లా పనిచేసి మృత కణాలు, మురికినీ తొలగిస్తాయి.
News November 16, 2025
అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో మూవీ?

అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ అనుకున్నదానికంటే ముందే పూర్తయ్యే ఛాన్స్ ఉండటంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో ప్రాజెక్టును చేపట్టాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే బోయపాటితో చర్చలు జరిగాయని సమాచారం. వీరిద్దరి కాంబోలో గతంలో సరైనోడు మూవీ వచ్చింది.


