News September 24, 2025

PHOTOS: విద్యుద్దీపాల వెలుగుల్లో ఇంద్రకీలాద్రి

image

AP: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. విద్యుత్ దీపాల వెలుగులతో ఇంద్రకీలాద్రి పర్వతం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ప్రకాశం బ్యారేజ్ సైతం రంగురంగుల విద్యుత్ వెలుగుల్లో మెరిసింది. డ్రోన్ విజువల్స్‌ను పైన ఫొటో గ్యాలరీలో చూడవచ్చు.

Similar News

News February 6, 2026

అగ్ని-3 సక్సెస్.. 3 వేల KM దూరంలో ఉన్నా ధ్వంసమే!

image

అగ్ని-3 బాలిస్టిక్ మిసైల్‌ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ నుంచి టెస్ట్ ఫైర్ చేసినట్లు DRDO, రక్షణ శాఖ అధికారులు తెలిపారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష చేపట్టినట్లు చెప్పారు. అగ్ని-3 మిసైల్ 1.5 టన్నుల బరువు ఉంటుందని, 3 వేల కిలోమీటర్ల పరిధిలోని శత్రు లక్ష్యాలను ఛేదించగలదని వెల్లడించారు. అన్ని ప్రమాణాలను అందుకుంటూ లక్ష్యాన్ని చేరుకుందని తెలిపారు.

News February 6, 2026

క్వాంటం లీడర్‌గా ఇండియా.. మేం రెడీ: CBN

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న<<19063020>> క్వాంటం వ్యాలీ<<>> ప్రాజెక్టుకు రేపు శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో CM చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘1990ల చివర్లో ఇండియాను IT లీడర్‌గా నిలబెట్టాం. ఇప్పుడు క్వాంటం లీడర్‌గా సూపర్ పొజిషన్‌లో ఉంచేందుకు అమరావతిలో రెడీగా ఉన్నాం. రేపు గొప్ప రోజు కానుంది’ అని పేర్కొన్నారు. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో 2.30PMకు CBN భూమి పూజ చేస్తారు.

News February 6, 2026

ఇదిగో మన భవిష్యత్తు.. U-19 టీమ్‌పై ప్రశంసల జల్లు

image

ఆరోసారి U-19 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘U-19 టీమ్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ విజయం ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. కుర్రాళ్లు భయం లేకుండా ఆడారని.. వైభవ్ సూర్యవంశీ ఆట అమోఘమని సచిన్ కొనియాడారు. అలాగే అన్ని వయసుల ఫార్మాట్లలో భారత్ సత్తా చాటుతోందని విరాట్ అన్నారు. ‘మన భవిష్యత్తు ఇదిగో’ అంటూ కోచ్ గంభీర్ పోస్ట్ చేశారు.