News July 6, 2024
PHOTOS: కార్యకర్తలు, ఫ్యాన్స్‌తో జగన్

AP: మాజీ సీఎం జగన్ ఇవాళ కడప ఎయిర్పోర్ట్ నుంచి పులివెందుల మార్గమధ్యంలో వైసీపీ కార్యకర్తలు, ప్రజలను పలకరించారు. ఈ సందర్భంగా ఆయనతో పలువురు అభిమానులు ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వైసీపీ Xలో పోస్ట్ చేసింది.
Similar News
News March 9, 2026
గ్యాస్ కొరత.. బెంగళూరులో హోటల్స్ బంద్!

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపేయడంతో హోటళ్లను ఆపరేట్ చేయలేకపోతున్నామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘పశ్చిమాసియాలో యుద్ధం వల్ల వాణిజ్య వంట గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయింది. రేపటి నుంచి బెంగళూరులోని రెస్టారెంట్లు బంద్ అవుతాయి’ అని ఓ ప్రకటనలో తెలిపింది.
News March 9, 2026
అప్పటిదాకా పెట్రోల్ రేట్లు పెరగవు: ప్రభుత్వ వర్గాలు

దేశంలో అవసరమైనంత మేర నిల్వలు ఉన్నాయని, ఇంధన ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘క్రూడాయిల్ ధరలు 130 డాలర్లకు(ఒక బ్యారెల్‌కు) చేరే దాకా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. చమురు రేటు బ్యారెల్‌కు 100 డాలర్లుగా స్టెబిలైజ్ అవుతుంది. దేశంలో ఏ పెట్రోల్ పంపులోనూ కొరత లేదు. వివిధ మార్గాల ద్వారా క్రూడ్ సేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది’ అని వివరించాయి.
News March 9, 2026
నెయ్యికి కొరత లేదు: టీటీడీ

తిరుమల లడ్డూల తయారీలో వాడే నెయ్యికి కొరత లేదని TTD తెలిపింది. మూడంచెల కొనుగోలు విధానం ద్వారా ఆవు నెయ్యి సరఫరా అవుతోందని వెల్లడించింది. ఈ విషయంలో అసత్య ప్రచారాలు నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం 7 లక్షలకు పైగా లడ్డూలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడంతో క్లారిటీ ఇచ్చింది.


